యూరప్ లో ప్రభాస్ లగ్జరీ విల్లా.. ప్రభాస్ శ్రీను ఏమన్నాడంటే
ABN, Publish Date - Jul 24 , 2026 | 03:56 PM
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మిగతా హీరోల్లా.. ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు బయట చెప్పింది లేదు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మిగతా హీరోల్లా.. ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు బయట చెప్పింది లేదు. అసలు సోషల్ మీడియాలో కూడా కనిపించడం కష్టం. అందుకే ఆయన గురించి వచ్చిన ఏ పుకారు అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. గత కొన్నిరోజులుగా ప్రభాస్ విదేశీ పర్యటనలు, ఆస్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు యూరప్ లో రూ.కోట్ల విలువ చేసే లగ్జరీ విల్లా ఉందంటూ చాలా కాలంగా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ ప్రభాస్ ఆత్మీయ మిత్రుడు, నటుడు ప్రభాస్ శ్రీను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెక్ పెడుతూ అసలు నిజాలను బయటపెట్టాడు.
ప్రభాస్‌కు యూరప్‌లో రూ.కోట్ల విలువైన సొంత విల్లా ఉందంటూ వస్తున్న వార్తలను ప్రభాస్ శ్రీను తీవ్రంగా ఖండించాడు. అవన్నీ కేవలం ఆకతాయిలు సృష్టించిన పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు. డార్లింగ్ ప్రభాస్ విదేశాలకు ఎందుకు వెళ్తారో, అక్కడ ఆయన ఏం చేస్తారో వివరిస్తూ.. ఆస్తులు కొనుగోలు చేశారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. వరుస సినిమాలు, షూటింగ్‌ల రద్దీ, నిరంతర ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికే ప్రభాస్ విదేశీ పర్యటనలు చేస్తాడని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, తన ప్రైవసీని ప్రశాంతంగా గడపడానికి మాత్రమే లగ్జరీ రిసార్ట్స్‌లో ఉంటాడని.. అంతేకానీ అక్కడ సొంతంగా విల్లాలు, ఆస్తులు ఏవీ కొనలేదని ప్రభాస్ శ్రీను పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
ఇక ప్రభాస్ కి, తనకు మధ్య దూరం పెరిగిందని వచ్చిన వార్తలను కూడా కొట్టిపారేశాడు. తమ మధ్య ఎప్పుడు దూరం పెరగదని, తామిద్దరి మధ్య బంధం ఎప్పటిలానే ఉందని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, డార్లింగ్ ఎప్పటికీ డార్లింగేనని చెప్పాడు. ఇక ఈ క్లారిటీతో ప్రభాస్ ఆస్తులు గురించి వస్తున్న వార్తలు అబద్దం అని తేలిపోయింది.