సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాక్సాఫీస్‌ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?

ABN, Publish Date - Aug 12 , 2026 | 10:23 PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’.

Fauzi vs Eetha

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas).. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ (Fauzi). ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ కావ్యంతో క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.1970ల నాటి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్, డ్యాన్స్ క్వీన్ ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే.. ఇప్పుడు ప్రభాస్ ‘ఫౌజీ’కి బాక్సాఫీస్ దగ్గర పోటీగా ఒక క్రేజీ సినిమా నిలబడబోతోంది. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈఠ’ (Eetha). ప్రభాస్ - శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కాంబినేషన్‌లో వచ్చిన ‘సాహో’ (Sahoo) సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో తెలియంది కాదు. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ, జోడీ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ‘సాహో’ జోడీ బాక్సాఫీస్ దగ్గర ముఖాముఖి తలపడటానికి సిద్ధమైంది.


ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తోన్న ‘ఈఠ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరో వారం రోజుల్లోనే విడుదల ఉండటంతో, బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించడానికి ‘ఈఠ’ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు మేకర్స్. అభిమానులకు కాస్త నిరాశ కలిగినా, సరైన రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో డిసెంబర్ 4న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’.. డిసెంబర్ 4న శ్రద్ధా కపూర్ ‘ఈఠ’ అంటే కేవలం ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమయ్యాయి. అయితే ‘ఈఠ’ సినిమా ఎన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఒకప్పుడు జోడీగా ఆకట్టుకున్న ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఇప్పుడు డిసెంబర్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండటంతో సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ప్రభాస్ ‘ఫౌజీ’కి కనుక పాజిటివ్ టాక్, హిట్ టాక్ వచ్చిందో.. ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం శ్రద్ధా కపూర్ ‘ఈఠ’కి అంత సులభం కాదని ట్రేడ్ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ ‘సాహో’ కాంబో బాక్సాఫీస్ వార్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలంటే డిసెంబర్ వరకు ఎదురుచూడక తప్పదు.

Updated Date - Aug 12 , 2026 | 10:23 PM