సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krishna Maya: 'ఈశ్వర్‌' రీ-రిలీజ్‌ కు 'సాV3' టీమ్‌ ట్రిబ్యూట్‌!

ABN, Publish Date - Jun 11 , 2026 | 05:32 PM

ప్రభాస్ 'ఈశ్వర్‌' చిత్రం శనివారం రీ-రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్, నటుడు కృష్ణమాయ తన తాజా చిత్రం బృందంతో ప్రెస్ మీట్‌ నిర్వహించారు.

Eeswar Re Release

ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయలో మంచి నటుడు ఉన్నాడు. ప్రభాస్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్‌'కు ఆర్ట్ డైరెక్షన్‌ చేయడంతో పాటు కృష్ణ మాయ స్నేహితుడిగా ప్రధాన పాత్రనూ పోషించాడు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించాడు. కొన్నేళ్ళ క్రితం కృష్ణ మాయ 'రైల్వే స్టేషన్‌' మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. మళ్ళీ ఇప్పుడు 'సాV3' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సమ్రాట్‌, డీమోన్‌ పవన్, 'రాను ముంబైకి రాను' సాంగ్‌ ఫేమ్‌ లిఖిత ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రభాస్‌ తొలి చిత్రం 'ఈశ్వర్‌' శనివారం రీ-రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో దానికి ట్రిబ్యూట్‌గా 'సాV3' టీమ్‌ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు కృష్ణ మాయ మాట్లాడుతూ, 'ఈశ్వర్ సినిమాకు నేను ఆర్ట్ డైరెక్షన్‌ చేయడంతో పాటు నలుగురు స్నేహితులలో ఒకరిగా నటించాను. ఆ సినిమా మాకు మంచి పేరు తీసుకొచ్చింది. 'ఈశ్వర్' చిత్రంలో నటిస్తున్నప్పుడు మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు. ప్రభాస్ గారు, అభి, నేను, హనుమంతు... ఇలా అంతా సరదాగా కలిసి చేశాం. ప్రభాస్ కూడా మాతో పాటు సరదాగా ఉండేవారు. ఈ రోజు ప్రభాస్ గారు పెద్ద స్టార్ అయ్యారు. అంత పెద్ద స్టార్ మొదటి చిత్రంలో మేమంతా కలిసి నటించాం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ గారు నాకు గురువు లాంటివారు. ఆయనను చూసే ప్రొడక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఎవరికీ రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా కాంపాక్ట్ బడ్జెట్‌లో సినిమా ఎలా నిర్మించాలో ఆయన దగ్గర తెలుసుకున్నాను. 'సాV3' సినిమా విషయానికి వస్తే నేను డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తున్నాను. సరికొత్త కంటెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. త్వరలోనే థియేట్రికల్ గా సినిమాను రిలీజ్ చేస్తాం' అని అన్నారు.


యాక్టర్ అదిరే అభి మాట్లాడుతూ, 'నెక్ట్స్ ఇయర్‌కు 'ఈశ్వర్' సినిమా పాతికేళ్లకు చేరుకుంటుంది. అప్పుడు ఓ గెట్ టు గెదర్ పెట్టుకోవాలని, అందుకు కృష్ణమాయ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి కోరుతున్నా. 'ఈశ్వర్' సినిమా టైమ్ నుంచే కృష్ణమాయ మంచి స్నేహితులు అయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'సాV3' సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. హీరో సామ్రాట్ మాట్లాడుతూ, 'ప్రభాస్ గారు మా అందరికీ ఫేవరేట్ హీరో. ఆయన తొలి చిత్రం రీ రిలీజ్ కు మేమంతా టీమ్‌గా వెళ్లి థియేటర్‌లో చూస్తాం. ఇక మా సినిమా కోసం కృష్ణమాయ గారితో పాటు మేమంతా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మేము పడిన కష్టం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు.


ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, 'మా 'ఈశ్వర్' చిత్రంతో పరిచయమైన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. మా సినిమా శనివారం రీ-రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా 'సాV3' సినిమా తరుపున ఒక ట్రిబ్యూట్ గా కృష్ణ మాయ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం హ్యాపీగా ఉంది. కృష్ణమాయ చాలా ప్లాన్డ్ గా ఈ సినిమాను చేశాడు. సినిమా కంప్లీట్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టాడు. ప్రతి రూపాయి... సినిమా మీద ఖర్చు పెట్టాలని అతని ఆలోచన. పాటలు బాగున్నాయి. సినిమా కూడా బాగా చేశాడు. దాసరి గారు, కోడి రామకృష్ణ గారిలా మట్టిలో మాణిక్యాలు ఏరే దర్శకుడు కృష్ణమాయ. ఈ సినిమాతో హీరోయిన్‌ లిఖితకు మంచి పేరు రావాలి. ఈ మూవీ తప్పకుండా హిట్ కావాలి. ఇండస్ట్రీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓటీటీల వల్ల థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. కంటెంట్ బాగుంటే తప్ప మూవీస్ గట్టెక్కడం లేదు. ఈ సినిమా మంచి కంటెంట్ తో వస్తోంది. ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. హీరో డీమోన్ పవన్, హీరోయిన్‌ లిఖిత, నటి శ్రావణ సంధ్య, సెకండ్ హీరోయిన్ హారిక రవి, ప్రొడ్యూసర్ వి. విజయ తమ చిత్రం చక్కని ప్రేక్షకాదరణ పొందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సాయి కార్తీక్‌ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

Lust Stories: లస్ట్‌ స్టోరీస్‌.. వైబ్రేటర్‌ సీన్‌కు కథ ఏంటంటే..

Sanjeev Megoti: బాధలో అన్న మాటలే తప్ప.. కావాలని అన్నవి కాదు..

Updated Date - Jun 11 , 2026 | 05:33 PM