'రాజాసాబ్' దెబ్బ.. 'డార్లింగ్' రీ రిలీజ్‌కు క్రేజ్! గంటకు.. 5 వేల టికెట్లు సేల్
ABN, Publish Date - Apr 23 , 2026 | 06:53 PM
టాలీవుడ్ బాహుబలి.. ఇండియన్ సినిమా రేంజ్‌ను మార్చేసిన గ్లోబల్ స్టార్.. మన ప్రభాస్
టాలీవుడ్ బాహుబలి.. ఇండియన్ సినిమా రేంజ్‌ను మార్చేసిన గ్లోబల్ స్టార్.. మన ప్రభాస్ (Prabhas). సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్.. వచ్చే నాలుగేళ్ల వరకు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, సక్సెస్ గ్రాఫ్ పీక్స్‌లో ఉన్న టైంలో రాజాసాబ్ (The Raja Saab) రూపంలో ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోనే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రభాస్ రేంజ్‌కు తగ్గ సినిమా కాదంటూ విమర్శలు రావడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఆ గాయాన్ని మాన్పడానికి, డీలా పడ్డ ఫ్యాన్స్‌లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపడానికి మన డార్లింగ్ మళ్ళీ థియేటర్లలోకి అడుగుపెట్టాడు.
సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే, ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ క్లాసిక్ లవ్ స్టోరీ డార్లింగ్ (Darling) ఏప్రిల్ 23న గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయ్యింది. గతంలో ప్రభాస్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో, ఆయన కెరీర్‌కు అసలైన ఊపిరి పోసింది ఈ సినిమానే. కరుణాకరన్ మార్క్ టేకింగ్, ప్రభాస్ స్టైలిష్ లుక్స్, కాజల్ అగర్వాల్‌తో ఆ క్యూట్ కెమిస్ట్రీ.. అప్పట్లో ఒక సెన్సేషన్! ఒకే కథను రెండు విభిన్నమైన రీతుల్లో చూపించి దర్శకుడు సక్సెస్ సాధించారు. ఇది తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవం. అప్పట్లో ఈ చిత్రం ప్రభాస్ ఇమేజ్‌ను మాస్ హీరో నుండి డార్లింగ్ ఆఫ్ ది యూత్ గా మార్చేసింది. నేటికీ ప్రభాస్ వింటేజ్ లుక్స్ అంటే గుర్తొచ్చేది ఈ సినిమానే.
రాజాసాబ్ ఫ్లాప్ అని హేళన చేసిన వాళ్లందరికీ ఈ కలెక్షన్స్ కళ్లు చెదిరే సమాధానం చెబుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ బుక్ మై షోలో గంటకు 3 నుంచి 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే, అది ప్రభాస్ అనే బ్రాండ్ పవర్.. రాజాసాబ్ ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ మేనియా ఏ మాత్రం తగ్గలేదని ఈ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఈ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.
ఈ వారం బాక్సాఫీస్ బరిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మలయాళం నుండి వాలా-2 తెలుగులో రిలీజ్ అవుతున్నా దానికి పెద్దగా క్రేజ్ లేదు. రఘు కుంచె గారి గేదెల రాజు గురించి అసలు చర్చలే వినిపించడం లేదు. అయితే హాలీవుడ్ మూవీ 'మైఖేల్' మీద మాత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. అయినా సరే, థియేటర్ల దగ్గర మాత్రం మన డార్లింగ్ హవానే నడుస్తోంది. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానులు ప్రభాస్‌ను ఎలా ప్రేమిస్తారో మరోసారి అర్థమవుతోంది. వరుస హిట్లు, ఆపై ఒక పెద్ద ఫ్లాప్.. ఇలాంటి ఒడిదుడుకుల మధ్య డార్లింగ్ రీ-రిలీజ్ కావడం ఫ్యాన్స్‌కు ఒక పెద్ద రిలీఫ్. రాజాసాబ్ ఇచ్చిన నిరాశను ఈ 'డార్లింగ్' తన మ్యాజిక్‌తో మర్చిపోయేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.