Prabhas: ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్..
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:42 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి డార్లింగ్ బర్త్‌డే వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయి. ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల నుంచి వరుస అప్డేట్స్తో పాటు మరో కొత్త సినిమా ప్రకటన కూడా రానున్నట్లు తెలిసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పలు అప్డేట్స్ రానున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా నుంచి అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సరికొత్త లుక్‌లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్డేట్ మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుంది. (Prabhas Birthday Specials)
మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి కూడా పవర్-ప్యాక్డ్ పోస్టర్‌తో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట. ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బర్త్‌డే సందర్భంగా వచ్చే అప్డేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఇవే కాకుండా కల్కి-2, సలార్-2 చిత్రాల నుంచి కూడా సర్ప్రైజ్ లు ఉంటాయని తెలిసింది. అలాగే మరో క్రేజీ పాన్-ఇండియా మూవీ అధికారిక ప్రకటన వస్తుందని టాక్ నడుస్తోంది. ఇవన్నీ నిజమైతే ఈ బర్త్‌డేకి డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ ఖాయం
ALSO READ:
Bombay Stories: 'బాంబే స్టోరీస్' ఓటీటీ మూవీ.. విశ్లేషణ
Garividi Lakshmi: నాలుగు జిల్లాలకే పరిమితమైన నా కథ.. ప్రపంచమంతా తెలిసింది..
ఐశ్వర్య లక్ష్మిని ఇలా చూస్తే.. పిచ్చెక్కాల్సిందే