సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్ బర్త్‌డే.. వర్షం, ఛత్రపతి రీ-రిలీజ్

ABN, Publish Date - Oct 11 , 2026 | 03:31 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న రెండు సూపర్ హిట్ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

varsham Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న రెండు సూపర్ హిట్ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష జంటగా నటించిన 'వర్షం' (Varsham), రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం 'ఛత్రపతి' (Chatrapathi) రీ-రిలీజ్ కానున్నాయి.

'వర్షం' మూవీ అప్పట్లో యూత్‌ను ఎంతగానో అలరించగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు నేటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఇక 'ఛత్రపతి' చిత్రం ప్రభాస్‌కు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలు అత్యాధునిక 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Updated Date - Oct 11 , 2026 | 05:10 PM