సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్‌: అలాంటి దర్శకుడు దేశంలో లేడు.. ఇంత కృతజ్ఞతా డార్లింగ్‌..

ABN, Publish Date - Feb 21 , 2026 | 09:48 AM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఓ బ్రాండ్‌. ఆయన కథ రాయాలంటే నెలలు సమయం అవసరం లేదు. గోవా, పట్టాయా బీచ్‌లో కూర్చుంటే ఆయనకు అది ఒక రోజు పని.


డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jaganath)ఓ బ్రాండ్‌. ఆయన కథ రాయాలంటే నెలలు సమయం అవసరం లేదు. గోవా, పట్టాయా బీచ్‌లో కూర్చుంటే అది ఆయనకు ఒక రోజు పని.

ఆయన సాధించిన హిట్‌ సినిమాలన్నీ అలా రాసినవే. షూటింగ్‌ షురూ చేస్తే పూర్తి చేయడానికి ఏళ్లు అక్కర్లేదు. నెలలు చాలు. సినిమా ప్రారంభం రోజు విడుదల తేదీని ప్రకటించేంత క్లారిటీ ఉన్న దర్శకుడు.

అయితే కొంతకాలంగా దారి తప్పారు. సక్సెస్‌ ఆయనకు దూరంగా ఉంటోంది. గత వైభవం తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన సాధించిన విజయాలను ఓసారి గుర్తు చేసుకుంటే ఆ ఎనర్జీ మళ్లీ తిరిగి వస్తుంది. తాజాగా అలాంటి ఎనర్జీని పూరి జగన్‌కు ఇచ్చారు డార్లింగ్‌ ప్రభాస్‌.


తనకు ‘వర్షం’ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ సినిమాల్లో ఫేవరేట్‌ మూవీ ‘ఏక్‌ నిరంజన్‌’ అని సంతోష్‌ చెప్పగా,  పూరి జగన్నాథ్‌ గురించి ప్రభాస్‌ తన మనసులో మాట చెప్పారు. ‘పూరి గారిలా హీరో క్యారెక్టర్‌ రాయగల డైరెక్టర్‌ ఇండియాలోనే లేరు. నా  కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ‘బుజ్జిగాడు’. మొదట ఆ క్యారెక్టర్‌ గురించి వినగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. నా కెరీర్‌లో ‘ఏక్‌ నిరంజన్‌’ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ ని పూరి గారిలా రాసే డైరెక్టర్‌ మరొకరు లేరు’ అని ముక్కుసూటిగా చెప్పారు. ఆయన మాటలు పూరిపై ఉన్న కృతజ్ఞతను మరోసారి తెలియజేశాయి. ప్రభాస్‌ మాటలతో పూరికి, ఆయన అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చినట్లు అయింది. దర్శకుడిగా పూరి కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. తెలుగు సినిమాకు వంద కోట్ల కలెక్షన్లు కల అనుకుంటున్న తరుణంలో బాక్సాఫీస్‌ ను ఆ వైపు పరుగు తీయించారాయన. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో ‘స్లమ్‌ డాగ్‌’ సినిమా చేస్తున్నారు పూరి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఒక్క శుక్రవారం కలిసొచ్చింది అంటే పూరి లెక్కలు మొత్తం మారిపోతాయి. పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోగలరు. 

Updated Date - Feb 21 , 2026 | 10:48 AM