రీ-ఎంట్రీలో చందమామ కష్టాలు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 09:23 PM

సాధారణంగా ఒకప్పుడు కథానాయికలకు వివాహమైన తర్వాత సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది.ఒకవేళ వచ్చినా కూడా అక్క, అత్త పాత్రల్లో కనిపించేవారు.

Kajal Aggarwal

సాధారణంగా ఒకప్పుడు కథానాయికలకు వివాహమైన తర్వాత సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది.ఒకవేళ వచ్చినా కూడా అక్క, అత్త పాత్రల్లో కనిపించేవారు. కానీ, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వరుస బ్లాక్‌బస్టర్ హిట్లు కొడుతూ అందరికీ బిగ్ షాక్ ఇస్తున్నారు. అయితే, ఈ రీ-ఎంట్రీ ట్రెండ్ అందరి నటీమణులకు ఒకేలా కలిసి రావడం లేదు. కొందరు పెళ్లి తర్వాత కూడా తమ క్రేజ్‌ను నిలబెట్టుకుంటుంటే.. మరికొందరికి మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. దురదృష్టవశాత్తూ ఆ లిస్ట్‌లోకి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా చేరిపోవడం విశేషం.


ఒక్కప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ డామ్‌ను అనుభవించి, అగ్ర కథానాయకుల సరసన వరుస హిట్లు అందుకున్న కాజల్ పెళ్లి తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా తీవ్రంగా పోరాడుతోంది. రీ-ఎంట్రీ తర్వాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతుంది. వరుస పరాజయాలు ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్లకు ఆఫర్స్ వెల్లువెత్తుతుంటే.. కాజల్ కి మాత్రం ఒక్క మంచి ఆఫర్ కూడా దక్కడం లేదు. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ ప్రాజెక్ట్ భారతీయుడు 2పై కాజల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ సీక్వెల్ లో అమ్మడు కనిపించింది లేదు. భారతీయుడు 3 ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం.


ఇక నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి వంటి సక్సెస్ లభించినా, అది కాజల్‌కు కొత్తగా ఆఫర్ల సునామీని తెచ్చిపెట్టడంలో విఫలమైందనే చెప్పాలి. కాజల్ కి ఆఫర్స్ రాకపోవడానికి మరో కారణం కుర్ర హీరోయిన్స్ తాకిడి పెరగడం ఒకటి అని చెప్పొచ్చు. రోజుకో హీరోయిన్ పరిచయం అవ్వడం.. చాలామంది మేకర్స్ ఒకే హీరోయిన్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తుండడంతో సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, భిన్నమైన పాత్రల వైపు దృష్టి సారిస్తున్న ఈ చందమామ, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్టులతో కమ్‌బ్యాక్ ఇస్తుందో వేచి చూడాలి.

Updated Date - Jul 28 , 2026 | 09:26 PM