సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ABN, Publish Date - Jan 29 , 2026 | 11:29 AM

ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు సంగీతం అందించిన ఆయన పలు నంది అవార్డులను అందుకున్నారు.

Nalluri Sudheer Kumar

రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలతో పాటు చిత్రసీమలోనూ సంగీత దర్శకుడిగా రాణించిన నల్లూరి సుధీర్ కుమార్ (70) (Nalluri Sudheer Kumar) గురువారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ తొలినాళ్ళలో సుధీర్ కుమార్ అందులో వందలాది పాటలను స్వరపర్చారు. టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్ కు సంగీతం అందించిన సుధీర్ కుమార్ ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు.


పలు చిత్రాలకూ ఆయన సంగీతం అందించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అగ్ని ప్రవేశం'కు ఆయనే సంగీత దర్శకుడు. అలానే తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన 'కూతురు', 'అత్తా నీ కొడుకు జాగ్రత్త', 'అమ్మో అల్లుడు' తదితర చిత్రాలకు సంగీతం అందించారు. 2024లో వచ్చిన 'ఎస్ -99' ఆయన సంగీతం సమకూర్చిన చివరి చిత్రం. మచిలీపట్నంకు చెందిన సుధీర్ కుమార్ యుక్తవయసులోనే హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన మృతికి పలువురు టీవీ, సినీరంగాలకు చెందిన వారు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుధీర్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో జనవరి 30న జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 03:39 PM