సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అగ్నిసాక్షి హీరోయిన్ ఐశ్వర్య విడాకులు..

ABN, Publish Date - Oct 13 , 2026 | 01:07 PM

ఈమధ్య ఇండస్ట్రీలో విడాకులు సర్వ సాధారణంగా మారిపోయాయి. వెండితెర స్టార్స్ మాత్రమే కాకుండా బుల్లితెర స్టార్స్ జీవితాల్లో కూడా విడాకులు కామన్ గా మారిపోయాయి.

Aishwarya Pisse

ఈమధ్య ఇండస్ట్రీలో విడాకులు సర్వ సాధారణంగా మారిపోయాయి. వెండితెర స్టార్స్ మాత్రమే కాకుండా బుల్లితెర స్టార్స్ జీవితాల్లో కూడా విడాకులు కామన్ గా మారిపోయాయి. తాజాగా తెలుగు, కన్నడ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే (Aishwarya Pisse) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేసింది. తన భర్తతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. గత కొంతకాలంగా తన వైవాహిక జీవితంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు, అనవసరమైన పుకార్లకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.


నా పేరు మీనాక్షీ అనే సీరియల్ తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఐశ్వర్య అగ్నిసాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగు, కన్నడలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నా పేరు మీనాక్షీ హీరోయిన్ నవ్య స్వామి అన్నయ్య హరి వినయ్ ని 2019లో పెళ్లి చేసుకుంది. దాదాపు ఏడేళ్ళు కలిసి ఉన్న ఈ జంట గత ఏడాది నుంచి విడిగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, ఐశ్వర్య తన భర్తకి విడాకులు ఇచ్చిందని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఐశ్వర్య మండిపడింది.


తాము ఇద్దరం గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నామని, చాలాసార్లు ఆలోచించిన తర్వాతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చామని ఐశ్వర్య తెలిపింది. ఇది తమ ఇద్దరి వ్యక్తిగత నిర్ణయమని, ఈ కష్టసమయంలో తమ మనశ్శాంతిని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను, శ్రేయోభిలాషులను ఆమె కోరింది. దయచేసి తమ నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుని ఆమోదించాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేసింది. తన పని, తన జీవితం పూర్తిగా తన వ్యక్తిగతమని తెలిపింది.


ఇదే సమయంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి తప్పుడు కథనాలు సృష్టిస్తున్న వారిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, సీరియల్ సన్నివేశాలను సందర్భం లేకుండా వాడుకోవడం లేదా తన వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేసేవారు తన పరిధిని అర్థం చేసుకుని ప్రవర్తించాలని, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని స్పష్టం చేసింది. కేవలం నిజమైన సమాచారాన్ని మాత్రమే అందించడానికి ఈ ప్రకటన విడుదల చేశానని, సీరియల్ సన్నివేశాలకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తన వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసేలా లేదా తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని ఐశ్వర్య గట్టిగా స్పష్టం చేసింది.

Updated Date - Oct 13 , 2026 | 02:34 PM