మొన్న అషు.. నేడు నందు.. జనాలని మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు
ABN, Publish Date - Jun 01 , 2026 | 05:42 PM
సోషల్ మీడియా వచ్చాకా ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ అకౌంట్ ని ఓపెన్ చేసి.. తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ వీడియో తీసి అప్లోడ్ చేయడం..
సోషల్ మీడియా వచ్చాకా ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ అకౌంట్ ని ఓపెన్ చేసి.. తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ వీడియో తీసి అప్లోడ్ చేయడం.. దానిని జనాలు చూస్తూ సూపర్.. మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో వారు స్టార్స్ గా మారుతున్నారు. ఇక వారి పాపులారిటీ చూసి ఇండస్ట్రీవాళ్ళు వాళ్ళ సినిమాను ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారు. అలా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏది ప్రమోట్ చేస్తే అది ఫాలోవర్లు గుడ్డిగా నమ్మేసి మోసపోతున్నారు.
అందాల భామ అషురెడ్డి అలాగే ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి రూ.9 కోట్లు లాగేసింది. ఇప్పుడు అతను లబోదిబో అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదొక మోసం అయితే.. ఇప్పుడు తాజాగా మరో మోసం బయటపడింది. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ నమ్మించి కోట్లు కొల్లగొట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాదాపు 30 మందిని మోసం చేసినట్లు సమాచారం.
అసలు ఎవరు వీరు అంటే.. యూట్యూబ్ లో నందు వరల్డ్ పేరుతో నందన అనే తెలుగు మహిళ ఒక ఛానెల్ నడుపుతుంది. ఆమె భర్త యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో రోజు ఏదో ఒక కంటెంట్ చూపిస్తూ ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకుంది. వీరి ఫ్యామిలీ ఎంత గుర్తింపు తెచ్చుకుంది అంటే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నందన చిరుతో కలిసి నటించింది. రెస్టారెంట్ లో భర్తల గురించి మాట్లాడే మహిళగా ఆమె కనిపించింది. ఈ పాత్రకు మంచి గుర్తుమ్పు కూడా లభించింది.
ఇక నందన.. ఆమె భర్త అసలు వ్యాపారం యూట్యూబ్ మాత్రమే కాదని, ఇద్దరూ కలిసి అమాయకులైన వారిని మోసం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ వర్క్ వీసాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారాయి. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ నందు యూట్యూబ్ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని, నమ్మి వచ్చిన ఎంతోమంది తెలుగు వారిని వీరు మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యూకే వీసా ప్రక్రియలో కీలకమైన COS (Certificate of Sponsorship) పత్రాల విషయంలో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది.
యూకేలో లీగల్‌గా ఉద్యోగం చేయాలంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ నుండి COS లెటర్ తప్పనిసరి. ఈ స్కామ్‌లో భాగంగా నందు భర్త బాధితులకు నకిలీ COS పత్రాలను సృష్టించి ఇచ్చి, వాటి ద్వారా వీసాలు వచ్చేస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి, తీరా వీసా అప్లికేషన్ స్టేజ్ లేదా ఇమ్మిగ్రేషన్ తనిఖీల వద్దకు వచ్చేసరికి ఆ పత్రాలు చెల్లనివిగా తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 30 మందికి పైగా అమాయకులు ఈ నకిలీ వీసా వెరిఫికేషన్ వల్ల రోడ్డున పడ్డారని, దాదాపు కోట్లలో డబ్బు చేతులు మారిందని సమాచారం. ఇప్పటివరకు ఈ స్కామ్ పై నందు నోరు విప్పలేదు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.