Poonam Kaur: గురుజీపై పూనమ్ ఫైర్.. ఆయన కెరీర్ ఏమీ ఆగిపోదంటూ నెటిజెన్ కౌంటర్
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:25 PM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు, నటి పూనమ్ కౌర్ కు (Poonam kaur) కొంతకాలంగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా విడుదలైన, ఆయన ఏదైనా వేదికపై కనిపించిన పూనమ్ పూనకం వచ్చినట్లు ఉగిపోతుంటుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు (Trivikram), నటి పూనమ్ కౌర్ కు (Poonam kaur) కొంతకాలంగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా విడుదలైన, ఆయన ఏదైనా వేదికపై కనిపించిన పూనమ్ పూనకం వచ్చినట్లు ఉగిపోతుంటుంది. సోషల్ మీడియా వేదికగా గురూజీని చీల్చి చెండాడుతుంటుంది. గతంలోనూ ఆయనపై ఆరోపణలు చేస్తూ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాజాగా మరోసారి ఆమె త్రివిక్రమ్ పై ధ్వజమెత్తింది.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఫేక్ గురూజీ’ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా తన కెరీర్‌ను ముగించారంటూ వ్యాఖ్యలు చేశారు. “నువ్వు నా కెరీర్‌ను ముగించావు. ఎందుకంటే నీ దుర్వినియోగాన్ని నేను ప్రశ్నించానని? ఇప్పుడు దేవుడు నీకు ఏమి చేశాడో చూడు. కాస్త అయినా సిగ్గుపడాలి. నువ్వు వేదికలపై నీతులు చెప్పవచ్చు.. కానీ నేను వాటిని ఆచరిస్తాను” అంటూ ఘాటుగా రాసుకొచ్చారు. ఈ పోస్టు లో ‘ఫేక్ గురూజీ’ అని వ్యాఖ్యానించారు కానీ త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆమె కామెంట్స్ ఆయన గురించే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు అయితే పూనమ్ కౌర్ పై కామెంట్స్ చేస్తున్నారు.
"టాలెంట్ ఉంటే ఎవడు మనల్ని ఆపలేడు. ఒకడి పైన మనం నిందలు వేస్తున్నాం అంటే అవతల వాడు ఖచ్చితంగా గొప్పోడే అయి ఉంటాడు దాంట్లో ఏ మాత్రం సందేశం లేదు. 'ఆదర్శ కుటుంబం' సినిమా నీకు నచ్చకపోవచ్చు కానీ చూసే వాళ్ళు చూస్తున్నారు కదా? ఆదివారం కూడా షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. నీ కామెంట్స్ వల్ల ఆయన కెరీర్ ఏమీ ఆగిపోదు. 'అజ్ఞాతవాసి' నుండి 'అరవింద సమేత' ఆయన ఎన్నో చూశారు. పడడం.. లేవడం ఆయనకి కొత్తేమీ కాదు' అంటూ ఓ నెటిజెన్ పూనమ్ కౌర్ కు గట్టిగా ఇచ్చిపడేసింది.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
King: ‘కింగ్’.. ఫస్ట్ సాంగ్.. చూసేయండి
డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్