సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్రివిక్రమ్ బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించాడు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖలు

ABN, Publish Date - Oct 09 , 2026 | 09:27 PM

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. గురూజీ సినిమా రిలీజ్ అవుతుంది అనే సమయంలోనే పూనమ్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.

Poonam Kaur

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. గురూజీ సినిమా రిలీజ్ అవుతుంది అనే సమయంలోనే పూనమ్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్న పూనమ్ కౌర్, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఆయన పేరును నేరుగా ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తన కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని, వారితో బలవంతంగా స్టేట్‌మెంట్స్ ఇప్పించాడని ఆమె ఆరోపించింది.


తన కుటుంబంతో ఎన్ని స్టేట్‌మెంట్లు ఇప్పించినా తాను ఆ స్టేట్‌మెంట్లకు ఎంతమాత్రం కట్టుబడి ఉండబోననిఖరాకండీగా చెప్పుకొచ్చింది. రాజకీయ నాయకులు చేసిన పనులకు తమ కుటుంబం జవాబు చెప్పాల్సిన అవసరం లేదని పూనమ్ స్పష్టం చేసింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పుకోవడం, మళ్లీ వారికి సహాయం కావాల్సినప్పుడు తమను వాడుకోవడం త్రివిక్రమ్ చేసిన అత్యంత దుర్మార్గమైన పని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.


అంతేకాకుండా, ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మౌనాన్ని కూడా పూనమ్ కౌర్ తీవ్రంగా తప్పుపట్టింది. 'త్రివిక్రమ్‌ను 'మా' అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు ఎవరి కోసం వేచి చూస్తున్నారు? ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం కావాలని కోరుకుంటున్నారు?' అంటూ ఘాటు ప్రశ్నలు సంధించింది. అయితే పూనమ్ ఇంతగా మండిపడడానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఆరోపణలపై దర్శకుడు త్రివిక్రమ్ గానీ, మా అసోసియేషన్ గానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - Oct 09 , 2026 | 09:27 PM