Pooja Hegde: అరుదైన గౌరవం.. ‘ఇది ఆరంభం మాత్రమే’
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:18 AM
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు (Pooja hegde) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరిగిన ఓ ప్రత్యేక గాలా కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. దీనికి ఉప్పొంగిపోయిన పూజా హెగ్డే.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'న్యూయార్క్‌లో జరిగే గాలా కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నా'నంటూ పూజా హెగ్డే పోస్ట్ చేశారు. తనను గౌరవించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సత్కారం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
'నన్ను సత్కరించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్‌కు ధన్యవాదాలు. ఈ గౌరవం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నిర్వాహకులకు కృతజ్ఞతగా ఉంటాను. ఇంతటి ప్రేమను అందుకున్న తర్వాత మళ్లీ వర్క్ మోడ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు చాలా ఉంది' అని పేర్కొన్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజ ఇప్పుడు అవకాశాలు అందుకోవడంలో కాస్త వెనకపడ్డారు. ఇటీవల ' జన నాయకుడు' సినిమాలో కథానాయికగా మెరిశారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కాంచన 4', 'శ్రీ శ్రీ' చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
మ్యాడ్ కాంబో.. కార్తీక్ సుబ్బరాజ్‌తో వరుణ్ తేజ్!
‘ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి
రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష..