రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష..
ABN , Publish Date - Aug 19 , 2026 | 03:54 PM
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది.
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. ఐకానిక్ సీరియల్ మొగలి రేకులు తో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత రాములమ్మ, చెల్లెలి కాపురం, స్వాతి చినుకులు లాంటి పలు ప్రజాదరణ పొందిన ధారావాహికల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుకుంది. కెరీర్ అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట, కొన్నేళ్ల క్రితం మనస్పర్థలు, వ్యక్తిగత విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
విడాకుల తర్వాత తన కుమారుడితో కలిసి ఉంటున్న శిరీష, ప్రస్తుతం మళ్లీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, ఆర్‌జే, యాంకర్ అయిన మహేంద్ర బొర్రాని ఆమె త్వరలోనే వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఒక ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం, ఆ తర్వాత కాలంలో స్నేహంగా మారినట్లు తెలుస్తోంది. క్రమంగా వీరిద్దరి మధ్య అనుబంధం బలపడి ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకున్నారట. ఈ వేడుకను ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించాలని ఈ జంట ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇక వరుడిగా మారనున్న మహేంద్ర బొర్రా విషయానికి వస్తే, ఆయన బుల్లితెరపై యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, నటుడిగా ఇంటింటి రామాయణం, మగువ ఓ మగువ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి నటన పరంగా కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. త్వరలోనే ఈ జంట తమ వివాహా విషయాన్ని అధికారికంగా అభిమనులతో పంచుకుంటారేమో చూడాలి.