Pocket Rockkets : పాకెట్‌లో ఉన్న ఫోన్ తీయకుండా చూసే సినిమా..
ABN, Publish Date - Nov 03 , 2026 | 10:42 PM
పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు.
''పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో ఇంత ప్రణాళికతో పని చేసే నిహారిక లాంటి ప్రొడ్యూసర్‌ని చూడలేదు" అని జేడీ చక్రవర్తి అన్నారు. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాలో కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా… శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం ది ఫస్ట్ హ్యాండ్ అంటూ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ "ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ గారు పెంచారు. రుద్ర గారు ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి" అని అన్నారు.
త్రినాథ వర్మ మాట్లాడుతూ ‘‘పాకెట్ రాకెట్స్’లో నేను అంజి అనే పాత్రలో కనిపిస్తాను. జీవితాన్ని మార్చుకోవాలని, అవకాశం రావాలని తపన పడే కుర్రాడి పాత్ర. నా జీవితంలోని పాత్రకు కనెక్ట్ అయ్యాను. నన్ను మళ్లీ హీరోగా నిలబెట్టిన నిహారిక గారు, మన్యం రమేష్ గారికి థాంక్స్. ఇద్దరు కుర్రాళ్లు తమ జీవితాల్ని బాగు పర్చుకునేందుకు ఏం చేశారు అన్నది ఈ చిత్రంలో చూపించాం. జేడీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది" అన్నారు.
నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘మేం డిజిటల్ కంటెంట్ చేసేవాళ్లం. మాకు ఇదే తొలి చిత్రం. నిహారిక గారితో మేం కలిసి ఈ సినిమాని నిర్మించాం. రుద్ర చెప్పిన స్క్రిప్ట్ మాకెంతో నచ్చింది. ‘పాకెట్ రాకెట్స్’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాకెట్‌లో ఉన్న ఫోన్ తీసి తీయకుండా రెండు గంటల సేపు అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు రుద్ర అత్రి మాట్లాడుతూ ‘‘పాకెట్ రాకెట్స్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు ఇంతలా సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. నా టీం ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమాని ఇంత వేగంగా పూర్తి చేయగలిగాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
.