సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రధాని బర్త్ డే.. రామ్ చరణ్ కీలక నిర్ణయం

ABN, Publish Date - Sep 18 , 2026 | 08:11 AM

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ram charan

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ సేవా సంకల్ప అభియాన్ (Seva Sankalp Abhiyan) లో తాను చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సమాజానికి తన వంతు సాయంగా రాబోయే నెలల్లో 1,000 మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) శిక్షణ అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చరణ్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో 'RC17' మూవీ చేయనున్నారు.

Updated Date - Sep 18 , 2026 | 08:14 AM