సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీకాంత్‌: ప్రేయసిరావే తరహాలో హిట్‌ కావాలి..

ABN, Publish Date - Mar 21 , 2026 | 08:22 PM

రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రధాన పాత్రల్లో మహేష్‌ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’.

రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రధాన పాత్రల్లో మహేష్‌ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’ (Pithapuramlo Ala Modalayindi). ‘అలా మొదలైంది’ అనేది ఉప శీర్షిక. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) నిర్మాతలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను శ్రీకాంత్‌ నటించిన ‘ప్రేయసి రావే’ చిత్ర బృందం విడుదల చేశారు. చంద్ర మహేశ్‌కు ఈ చిత్రం మంచి కమ్‌ బ్యాక్‌ కావాలని శివాజీ రాజా, పృథ్వీ, యం.యం.శ్రీలేఖ అభిలషించారు.  

హీరో శ్రీకాంత్‌  మాట్లాడుతూ
‘ప్రేయసి రావే’ కంటే ముందు నేను చేసిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడలేదు. చంద్ర మహేష్‌ నాతో తీసిన ‘ప్రేయసి రావే’ మంచి విజయం సాధించింది. ఈ ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమా కథ గురించి కూడా నాకు మహేష్‌ చెప్పాడు. మూడు డిఫరెంట్‌ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశాడని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి.    ‘ప్రేయసిరావే’ రేంజ్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌, కాన్సెప్ట్‌ దొరికితే చంద్ర మహేష్‌, నేను కలిసి సినిమా చేస్తాం’ అన్నారు.  

దర్శకుడు మహేష్‌ చంద్ర మాట్లాడుతూ
‘శ్రీకాంత్‌ హీరోగా తీసిన ‘ప్రేయసి రావే’ నాకు లైఫ్‌ ఇచ్చింది.   ఆ టీంతో మా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ‘ప్రేయసి రావే 2’ కథ కూడా రెడీ చేశాను. ‘ప్రేయసి రావే’ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫీల్‌ అయితే వచ్చిందో.. ‘పిఠాపురంలో అలా మొదలైంది’ టైంలోనూ అదే ఫీలింగ్‌ వచ్చింది. ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ  క్లైమాక్స్‌కు ఎమోషనల్‌ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. నిర్మాతల సహకారం మరువలేనిది. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ సినిమా చేశాం.  అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత దుండిగళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వచ్చింది.  మూవీ పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు

Updated Date - Mar 21 , 2026 | 08:23 PM