కొరటాల శివ : చంద్ర మహేష్ సెన్సిబిలిటీస్.. ఇంపాక్ట్ నాకు తెలుసు..
ABN, Publish Date - Mar 31 , 2026 | 12:56 PM
మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన 'పట్టుకో బాబా' పాటను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కొరటాల శివ మాట్లాడుతూ 'చంద్ర మహేష్ అప్పట్లో తీసిన బ్లాక్ బస్టర్ 'ప్రేయసి రావే'తోపాటు మరికొన్ని చిత్రాలకు రైటింగ్ అసిస్టెంట్ గా పని చేశాను. ఇప్పుడు ఈ సాంగ్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేటి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లితండ్రులతో వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్ ని చర్చిస్తూ రిలేషన్ షిప్స్, అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం చాలా మంచి విషయం. ఇలాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. దర్శకుడు చంద్ర మహేష్ గారి సెన్సిబిలిటీస్ గురించి నాకు తెలుసు. ఒక ఫీల్ ని ఎంత ఇంపాక్ట్ గా చెబుతారో 'ప్రేయసి రావే' టైంలోనే చూశాను. ఆ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. 'ప్రేయసి రావే' లాగా అదే ఫీల్ తో 'పిఠాపురంలో' సినిమా ఉంటుందని నమ్ముతున్నాను' అని చెప్పారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ 'ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫస్ట్ కాపీ సిద్దమయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అన్ని ఏరియాల పంపిణీదారులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు' అని తెలిపారు.