అలియాస్ రుక్మిణి.. ఫీల్ గుడ్ సాంగ్స్ చాలు.. మాస్ బీట్ వదులు నాని
ABN, Publish Date - Nov 13 , 2026 | 09:25 PM
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం అలియా రుక్మిణి (Alias Rukmini). మురళి కాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని నాని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన ఆఫియా (Aafiya) హీరోయిన్గా పరిచయం కాబోతుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం అలియా రుక్మిణి (Alias Rukmini). మురళి కాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని నాని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన ఆఫియా (Aafiya) హీరోయిన్గా పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే అలియాస్ రుక్మిణి సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మొన్నటివరకు మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఒక ప్యూర్ లవ్ స్టోరీతో రానున్నాడు. అందులో నాని ప్రజెంట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. నితిన్ లుక్ కూడా చాలా క్లాస్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అలియాస్ రుక్మిణి నుంచి వచ్చిన మొదటి పాట.. రుక్కు.. రుక్కు రుక్మిణి మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఇక తాజాగా రెండో లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. పిచ్చి ప్రేమలో అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన మధురమైన బాణీలు, రొమాంటిక్ మెలోడీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే ఓ వగలాడి.. అంటూ సాగే ఈ పాటలోని పదాలు ప్రేమలోని మధురిమను అద్భుతంగా చాటుతున్నాయి. నితిన్, ఆఫియా మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ ని సింగర్ కార్తీక్ తన గాత్రంతో మరింత రొమాంటిక్ గా మార్చేశాడు. అయితే ఈ సినిమా నుంచి రిలీజైన ఈ రెండు సాంగ్స్ ఫ్రెష్ గా.. వినసొంపుగా ఉన్నాయి. ఫీల్ గుడ్ సాంగ్ తో శ్రోతలను అలరిస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం మాస్ బీట్ కావాలని కోరుతున్నారు. రెండు ఫీల్ గుడ్ సాంగ్స్ చాలు.. మాస్ సాంగ్స్ దింపు నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4 న రిలీజ్ కి సిద్దమవుతోంది. మరి ఈ సినిమాతో నితిన్ హీరోగా.. నాని నిర్మాతగా మంచి హిట్ ని అందుకుంటారో లేదో చూడాలి.