Husharu 2 Teaser: అడవిలో అరుపులు.. మళ్లీ మొదలయ్యిందిరోయ్
ABN, Publish Date - Oct 27 , 2026 | 06:50 PM
టాలీవుడ్లో కల్ట్ యూత్‌ఫుల్ హిట్ హుషారు సినిమాని తెలుగు యువత అంతా త్వరగా మర్చిపోరు. నలుగురు కుర్రాళ్లు సొంతంగా బీర్ తయారు చేయడం. రసికరాజా ప్రొడక్షన్స్ లో అడవిలో అరుపులు సినిమా.. స్నేహం కోసం వారు నిలబడిన విధానం అందరినీ కంటతడి పెట్టించేలా చేసింది.
టాలీవుడ్లో కల్ట్ యూత్‌ఫుల్ హిట్ హుషారు సినిమాని తెలుగు యువత అంతా త్వరగా మర్చిపోరు. నలుగురు కుర్రాళ్లు సొంతంగా బీర్ తయారు చేయడం. రసికరాజా ప్రొడక్షన్స్ లో అడవిలో అరుపులు సినిమా.. స్నేహం కోసం వారు నిలబడిన విధానం అందరినీ కంటతడి పెట్టించేలా చేసింది. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 8 ఏళ్ల తరువాత హుషారుకి సీక్వెల్ గా హుషారు 2 రాబోతుంది. అయితే ఈసారి పార్ట్ 1 లో ఉన్న ముగ్గురు హీరోలు మారారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో అశోక్ గల్లా, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, రవి ఆంటోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సీక్వెల్ నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హుషారు 2 టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన టీజర్లో ఫన్, ఎనర్జీతో పాటు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఒక పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్లో కనిపించడం టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదటి పార్ట్ లో డబ్బు సంపాదించడానికి బీర్ తయారుచేసిన ఈ బ్యాచ్.. ఈసారి టకీలా తయారుచేయడం, అడవిలో అరుపులు సీజన్ 2 సినిమా మొదలుపెట్టనున్నట్లు టీజర్ లో చూపించారు. ఇక ఈసారి ఇందులో కామెడీతో పాటు ఒక సీరియస్ యాక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకోరు. కానీ, ఈ సినిమాకి ఒప్పుకున్నారు అంటే ఇందులో కచ్చితంగా ఆయన పాత్ర హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. సన్నీ ఎం.ఆర్ మరియు రామ్ మిర్యాల అందిస్తున్న స్పెషల్ మ్యూజిక్ అండ్ బీట్స్ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచాయి. కల్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఈసారి డబుల్ మ్యాడ్నెస్, యూత్‌ఫుల్ కామెడీతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.మరి ఈ సినిమా యూత్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.