నష్టాలను పూడ్చే పనిలో పీపుల్ మీడియా..
ABN, Publish Date - Apr 28 , 2026 | 07:57 PM
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు ఇండస్ట్రీలో ఉండేవారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు టాలీవుడ్ లో రెండు, మూడు హిట్లు కొట్టగానే బాలీవుడ్ లో పాగా వేయడం సాధారణమే.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు ఇండస్ట్రీలో ఉండేవారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు టాలీవుడ్ లో రెండు, మూడు హిట్లు కొట్టగానే బాలీవుడ్ లో పాగా వేయడం సాధారణమే. అయితే వారేనా బీ టౌన్ లో అడుగుపెట్టేది.. మాకేం తక్కువ.. మేము కూడా బీ టౌన్ లో పాగా వేస్తామంటున్నాయి టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్. అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బాలీవుడ్ లో రెండు సినిమాలను సెట్ చేసినట్లు తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ చిత్రాలకు కేరాఫ్ గా మారుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ' రాజాసాబ్' మూవీతో చేతులు కాల్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ నష్టాలను పూడ్చుకునే పనిలో పడింది. అందుకోసం క్రేజీ ప్రాజెక్టులను లైనప్‌లో పెట్టింది. పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ-2', అడివి శేష్‌తో 'గూఢచారి -2', తేజ సజ్జాతో 'మిరాయ్ -2', 'జాంబిరెడ్డి- 2' చిత్రాలతో మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. వీటితో పాటే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుందని టాక్.
గతంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'జాట్' చిత్రాన్నినిర్మించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ బ్యానర్ లోనే 'జాట్- 2' కూడా రావాల్సి ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సింగిల్ గానే ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. దీంతో పీపుల్ మీడియా సొంతంగా తమ గుర్తింపును తెచ్చుకోవడానికి యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. టైగర్‌కు ఉన్న యాక్షన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ రెండు ప్రాజెక్టులను రూపొందించబోతోందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సౌత్ నుంచి నార్త్‌లోనూ పాగా వేయడానికి మంచి స్కెచ్ వేసింది. మరి ఈ స్కెచ్ కి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.