సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది: ‘చికిరి చికిరి’ పాటను మించి రెండో పాట..

ABN, Publish Date - Feb 24 , 2026 | 02:55 PM

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో రెండో సాంగ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ కథానాయిక. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా అత్యంత వేగంగా నడుస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘చికిరి చికిరి’ సాంగ్‌ రిలీజై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయింది. సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో రెండో సాంగ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి 2న సెకండ్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేశారట. దీనిపై త్వరలోనే  అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది హీరో పరిచయ గీతమని తెలిసింది.  

ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. 'చికిరి చికిరి' సాంగ్‌ రిలీజ్‌ చేసిన ఒక్క రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుని ట్రెండ్‌ సెట్‌ చేసింది. తదుపరి 100 మిలియన్లను పైగా వ్యూస్‌తో హిస్టరీ క్రియేట్‌ చేసింది. ఇంతకు మించి రెండో సాంగ్‌ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మొదటి రిలీజ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమా మార్చి 27న విడుదల కావాలి. కొంత షూటింగ్‌ పెండింగ్‌లో ఉండటం వల్ల రిలీజ్‌ వాయిదా వేశారు.  ఏప్రిల్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మీర్జాపూర్‌ ఫేం దివ్యేందు శర్మ, బోమన్‌ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.  

Updated Date - Feb 24 , 2026 | 02:59 PM