Mega Family: మెగా.. వారసుడొచ్చేశాడు! కవలలకు.. జన్మనిచ్చిన ఉపాసన
ABN, Publish Date - Jan 31 , 2026 | 10:30 PM
మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది. రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఉపాసన శనివారం రాత్రి పండంటి కవలలకు ఒక బాబు, ఒకపాపకు జన్మనివ్వగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. రామ్ చరణ్, చిరంజీవి (Chiranjeevi) మెగా ఫ్యామిలీ అంతా ప్రస్తుతం అపోలో ఆస్పత్రి (Appolo Hospitals) కి చేరుకోగా అభిమానులు సైతం భారీగా ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలుపగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దవాఖాన వద్దే సంబురాలు చేసుకుంటున్నారు.. స్వీట్లు పంచి పెడుతున్నారు.
మెగా ఇంటికి కవలలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి, రామ్ చరణ్ ఉపాసన ఫ్యామిలీస్ ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నాయి. తమ ఆనందాన్నిమీడియా ఎదుట పంచుకోనున్నాయి. ఇదిలాఉంటే.. రామ్‌చరణ్ దంపతులకు జనవరి 31న కవలలు పుట్టబోతున్న విషయం చిత్రజ్యోతి రెండు రోజులు ముందుగానే సమాచారం ఇచ్చింది.