Divyenndu Sharma: రామ్ చరణ్‌తో నటించడం ఈజీ కాదు.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా
ABN, Publish Date - Jun 02 , 2026 | 12:12 PM
‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు దివ్యేందు శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవమని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో కీ రోల్ చేస్తున్న దివ్యేందు శర్మ (Divyenndu) మాట్లాడుతూ ఆడియన్స్‌లో జోష్ నింపారు.
ఆయన మాట్లాడుతూ.. విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ‘పెద్ది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం రావడానికి కారణమైన దర్శకుడు బుచ్చిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన ప్రతిభ, నాపై చూపించిన ప్రేమ, నమ్మకం వల్లే నేను ఈ సినిమాలో భాగమయ్యాను. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ, ఆదరణ చూపించారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం. ఆయనతో నటిచండం అంత ఈజీ కాదు. కానీ సెట్స్‌లో నాకు ఎంతో కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా నిర్మాత సతీష్ గారికి కూడా ధన్యవాదాలు. ఆయన ఈ సినిమాను ఎంతో ప్రేమతో, అంకితభావంతో నిర్మించారు. ఇక్కడ అభిమానుల స్పందన చూస్తుంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఇదే ఎనర్జీని మీరు జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ చూస్తున్నప్పుడు కూడా చూపిస్తారని నమ్ముతున్నాను. ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే పోరాటమే ‘పెద్ది’. అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ జర్నీ. ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మీ అందరూ ‘పెద్ది’ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.