సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది: ఫుల్‌ స్వింగ్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు..

ABN, Publish Date - Mar 14 , 2026 | 05:30 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉత్తరాంధ్రలోని స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయని పెద్ది టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.


ఈ మేరకు ఎడిట్‌ సూట్‌లో దర్శకుడు బుచ్చిబాబు, నవీన్‌ నూలి వర్క్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసి 'ఎవ్రీ సీన్‌.. ఎవ్రీ ఫ్రేమ్‌ ఫైర్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే పాటలు కూడా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి.

Updated Date - Mar 15 , 2026 | 02:44 PM