సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anantha Sriram: ప్రపంచం మొత్తం ఉలిక్కిపడే రోజు.. హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయే రోజు జూన్ 4

ABN, Publish Date - Jun 02 , 2026 | 12:38 PM

‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గేయరచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న రామ్ చరణ్ రూపంలో అద్భుతాన్ని ప్రపంచం చూస్తుందని, ‘పెద్ది’ రికార్డులు బద్దలు కొడుతుందని అన్నారు.

anantha sriram

విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ‘పెద్ది’ (Peddi) మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) మాట్లాడుతూ: తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరపై ఒక అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయే రోజు జూన్ 4 అంటూ త‌న‌దైన శైలి ప్ర‌సంగంతో చెల‌రేగిపోయారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. ఆ రోజు ‘పెద్ది’ బల్లగుద్ది మరీ రికార్డులను బద్దలు కొట్టి తన సత్తా చాటుకునే రోజు. ఆ రోజు నుంచి మీ జోరు, హుషారును ఎవ్వరూ ఆపలేరు. ఈ సినిమాలో నేను రాసిన పాటలకు వందల మిలియన్ల వ్యూస్ ఇచ్చి ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక గేయరచయితగా ఇంతకంటే పెద్ద విజయం మరొకటి ఉండదు.

ఈ సినిమాలో రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయాలపాలైనా షూటింగ్‌లో పాల్గొనడం, పాత్ర కోసం చూపిన అంకితభావం, మల్లయోధుడిలా తన శరీరాన్ని మలుచుకున్న తీరు గురించి వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రామాయణం ఎంతకాలం నిలివుంటుందో ‘పెద్ది’ కథ కూడా అంతకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. పదేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సినిమాగా ఇది నిలుస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాను అని అన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:51 PM