Peddi Trailer: గెలుపైనా.. ఓటమైనా కొండ కింద ఊరోడిదే కావాలా..
ABN, Publish Date - May 18 , 2026 | 05:03 PM
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా (Peddi) ట్రైలర్ వచ్చేసింది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా (Peddi) ట్రైలర్ వచ్చేసింది. ఫుల్ యాక్షన్ ప్యాక్ట్‌గా ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. ‘ఇక్కడ ఏ ప్లేయర్‌ని అడిగిన ఫేవరెట్ గేమ్ పేరు మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారడం లేదు.. ‘పెద్ది’ ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా’ అని బోమన్ ఇరానీ అడగగా ‘పెద్ది’ సర్ అంటూ రన్నర్, రెజ్లర్, క్రికెటర్.. ఇలా ఆల్‌రౌండర్ అంటూ ఆ ఊరి యువత ఇచ్చే జవాబు హీరో క్యారెక్టర్‌కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఆ డైలాగ్‌లన్నీ హీరో క్యారెక్టర్‌కు హైప్ నిస్తున్నాయి.
‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను, గెలుపైనా.. ఓటమైనా కొండ కింద ఊరోడిదే కావాలా..' అంటూ రామ్‌చరణ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు థియేటర్‌లో విజిల్స్ వేయించడం ఖాయం. ఉత్తరాంధ్ర యాసను ఆయన బాగానే ప్రాక్టీస్ చేశారు. దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ వంటి సీనియర్ ఆర్టిస్ట్‌ల డైలాగ్స్‌లోనూ మంచి పవర్ కనిపిస్తోంది. రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా అలరిస్తోంది.
పీకినవ్‌లే...
విలేజ్ అమ్మాయిగా జాన్వీ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా కావలసిందే. ‘పీకినవ్‌లే’ అంటూ ఆమె నోట పలికిన డైలాగులు అయితే ఊర మాస్ అనే చెప్పాలి. క్రీడా నేపథ్యమున్న సినిమా అనగానే యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ కూడా ముఖ్యం. యాక్షన్‌కు మాత్రమే కాకుండా ఎమోషన్స్‌కు మంచి స్కోప్ ఇచ్చారు దర్శకుడు. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్‌లు, ఎలివేషన్లు చూస్తుంటే దర్శకుడు బుచ్చి థియేటర్లు దద్దరిల్లేలా చేస్తాడనడంతో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. మాస్ యాక్షన్ ఆడియన్స్‌కి అయితే ఈ చిత్రం ఫుల్‌మీల్స్ పెట్టడం ఖాయం. అభిమానులు అయితే ఈ ట్రైలర్ కు ఫిదా అవుతున్నారు.