‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఉండవ్: డి. సురేష్ బాబు

ABN , Publish Date - May 23 , 2026 | 11:44 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబోలో రూపుదిద్దుకున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.

TPCC On Peddi Release

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో రూపుదిద్దుకున్న ‘పెద్ది’ సినిమా (Peddi Movie) జూన్ 4న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి మీడియా సమావేశం నిర్వహించి.. పర్సంటేజ్ విధానం కావాలంటూ నానా హంగామా మొదలెట్టారు. అసలీ మీటింగ్‌లో మాకు సంబంధమే లేదు అన్నట్లుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ప్రకటన ఇంతకు ముందే వచ్చింది. కానీ, అధ్యక్షుడి పేరు లేకుండా ప్రకటన రావడంతో.. అదొక కాంట్రవర్సీగా మారింది. మళ్లీ అదే ప్రకటనని, సురేష్ బాబు (D Suresh Babu) సైన్‌తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసింది.


ఈ ప్రకటనలో.. మే 15న జరిగిన నిర్మాతలు , ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో.. ఎగ్జిబిటర్స్ కోసం పర్సంటేజ్ విధానంపై నిర్ణయం తీసుకోవడానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మీకు తెలియజేస్తున్నాము. సదరు సబ్ కమిటీ రెండు సమావేశాలు నిర్వహించి, ఈ క్రింది అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ అంశాలను కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా ఆమోదించారు.

1) ‘పెద్ది’ సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల చేయడానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

2) ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ సినిమా టిక్కెట్ల ధరలో ఏదైనా పెరుగుదల ఉంటే, 7.5% (ఏడున్నర శాతం) చెల్లించవలసి ఉంటుంది.

3) ప్రీమియర్ షోల కోసం.. ఒక్కో షోకు, ‘A’ సెంటర్‌కు రూ.25,000, ‘B’ సెంటర్‌కు రూ.15,000, C’ సెంటర్‌కు రూ.5,000 చెల్లింపు చేయాల్సి ఉంటుంది.

TPCC.jpg


4) తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ ధర పెంచిన సందర్భంలో పై నిబంధనలు వర్తిస్తాయి. టిక్కెట్టు ధర పెంపు లేకపోతే, వారు ఎప్పటిలాగే పంపిణీదారులతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారు.

5) నిర్మాతలు , ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించారు.

6) నిర్మాతలు సమర్పించిన అన్ని షరతులను, ఆ సమయానికి అనుగుణంగా చర్చించి, అంగీకరించిన తర్వాత, తదుపరి పెద్ద సినిమా విడుదలకు ముందు లేదా 2026 జూన్ చివరి నాటికి కొత్త పర్సంటేజ్ విధానం నిర్ణయించబడుతుంది.

ఇవి కూడా చదవండి:

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 23 , 2026 | 11:48 PM