సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: హైద‌రాబాద్ శివారులో 'పెద్ది' స్పెషల్ సాంగ్..

ABN, Publish Date - Apr 25 , 2026 | 06:58 PM

‘పెద్ది’ విడుదల విషయంలో ఎంత గందరగోళం నడిచిందో.. ఐటెమ్‌ సాంగ్‌ విషయంలోనూ అదే జరిగింది. ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తారా? అని చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

‘పెద్ది’ విడుదల విషయంలో ఎంత గందరగోళం నడిచిందో.. ఐటెమ్‌ సాంగ్‌ విషయంలోనూ అదే జరిగింది. ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తారా? అని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని కోసం చాలా మంది  హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తొలుత మానసా వారణాసి పేరు బయటికొచ్చింది. తదుపరి మృణాల్‌ ఠాకూర్‌ ఖాయమే అన్నారు. వర్కవుట్‌ కాలేదు. ఫైనల్‌గా శ్రుతీహాసన్‌ ఎంచుకున్నారు. ఇప్పటికే శ్రుతీ చాలా చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసి అలరించారు. రెమ్యునరేషన్‌ కూడా బలంగానే సమర్పించుకోవాలి. అయితే ఈ సినిమాకు ఎంత పారితోషికం ఇస్తున్నారనేది ఇంకా బయటకు రాలేదు కానీ సాంగ్‌ షూటింగ్‌ మాత్రం మొదలెట్టేశారు. హైదరాబాద్‌ శివారులో షూట్‌ మొదలైంది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో ‘పెద్ది’ ఐటెమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు రోజులపాటు ఈ పాట చిత్రీకరణ జరగనుందని తెలిసింది.

ఇప్పటికే ఏఆర్‌ రెహమాన్‌ సంగీతంలో విడుదలైన రెండు పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. చికిరి సాంగ్‌, రయ్‌ రయ్‌ సాంగ్స్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేసేశాయి. అందుకు దీటుగా ప్రత్యేక గీతం కోసం మరో ట్యూన్‌ చేశారట రెహమాన్‌. ఈలోపు ఓ డ్యూయెట్‌ను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఐటెమ్‌ సాంగ్‌ను వదులుతారని తెలుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా తర్వాత జూన్‌ 25న ఈ చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలని చిత్ర బృందం తీవ్ర కృషి చేస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయిక.

Updated Date - Apr 25 , 2026 | 07:17 PM