సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: పెద్ది వాయిదా.. ఆ పండగే టార్గెట్

ABN, Publish Date - Jan 28 , 2026 | 03:00 PM

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ (Ram Charan).. ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను నమోదు చేయలేకపోయాడు.

Peddi

Peddi: ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ (Ram Charan).. ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను నమోదు చేయలేకపోయాడు. ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చిన ఆచార్య నిరాశపరచడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ ఛేంజర్ ఫలితం మెగాభిమానులను బాగా కలవరపరిచింది. దీంతో అందరి దృష్టి బుచ్చిబాబు సాన (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా మీదే పడింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు.. ఉప్పెన లాంటి లవ్ స్టోరీ తీసిన బుచ్చిబాబు, చరణ్‌తో ఎలాంటి సినిమా తీస్తాడో అని అందరూ సందేహించారు. కానీ, పెద్ది షాట్ బయటకి రాగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. ఈసారి చరణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో బుచ్చిబాబు ప్రజెంట్ చేయబోతున్నాడని అందరికి అర్థమైంది. ఇక ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన చికిరి చికిరి సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో చూశాం.. ఆ బీట్ వింటుంటేనే థియేటర్లలో రచ్చ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది.

పెద్ది సినిమాను తొలుత మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయనున్నారని మేకర్స్ తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌లో రిలీజ్‌ డేట్‌ పక్కాగా ఉండేలా చూసుకున్నారు. కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది చెప్పిన సమయానికి రావడం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఇంకా కొంత పెండింగ్ ఉండడం, దానికి తోడు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని బుచ్చిబాబు టీం పట్టుదలతో ఉందట. అందుకే, ఈ సమ్మర్ రేసు నుంచి తప్పుకుని.. దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆలస్యంగా వచ్చినా.. చరణ్ చేసే అటాక్ మాత్రం అరాచకంగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా మేనియా నడుస్తోంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OGతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు చిత్రంతో బాక్సాఫీస్ కింగ్ అని మరోసారి నిరూపించుకున్నారు. బాబాయ్ హిట్టు కొట్టాడు.. నాన్న బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.. మరి అబ్బాయి రేంజ్ ఎలా ఉండాలి? పెద్దితో రామ్ చరణ్ కొట్టే దెబ్బకు సౌత్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే అనే రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ అయినా, దసరా అయినా.. పెద్ది రాక బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్‌ చాలా ధీమాగా ఉన్నారు. మరి చరణ్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Jan 28 , 2026 | 03:00 PM