సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi Concert: పెద్ది కి ఆవాజ్ హైలైట్స్ ఏంటో తెలుసా ?

ABN, Publish Date - May 23 , 2026 | 02:14 PM

రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ (Peddi) చిత్రం జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ (Peddi) చిత్రం జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ ముమ్మరం చేశారు. శనివారం మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఏఆర్‌ రెహమాన్‌ ఆధ్వర్యంలో భారీ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ (Peddi ki aawaz) ప్లాన్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతోన్న అతిపెద్ద సినిమా ఈవెంట్‌ ఇది. దాదాపు 5 కోట్ల రూపాయలను ఈ ఒక్క ఈవెంట్‌ కోసం ఖర్చుపెడుతున్నారు మేకర్స్‌. ఈ కాన్సెర్ట్‌ కోసం సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ దాదాపు రూ.150 కోట్ల విలువైక మ్యూజిక్‌ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించనున్నారు. భోపాల్‌ దద్దరిల్లేలా సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు.


వేదికపై రెహమాన్‌ ‘రయ్‌ రయ్‌ రారా’, మోహిత్‌ చౌహాన్‌ చికిరి చికిరి పాటలను ఆలపించనున్నారు. వీటికి రామ్‌చరణ్‌ పెర్‌పార్మెన్స్‌ కూడా ఉండొచ్చని కూడా టాక్‌ నడుస్తోంది. నేటి ఉదయమే రామ్‌చరణ్‌, రెహమాన్‌ హైదరాబాద్‌ నుంచి భోపాల్‌కు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు ఈవెంట్‌    మొదలవుతుంది. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా నిడివి 3.09 నిమిషాలు ఉన్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

Updated Date - May 23 , 2026 | 02:14 PM