సమ్మర్ 2026.. ఆశలన్నీ పెద్ది పైనే
ABN, Publish Date - May 05 , 2026 | 08:03 PM
మరో మాసం రోజులు దాటితే వేసవి టాటా చెప్పేస్తుంది. ఇప్పటి దాకా ఒక్క హిట్టూ లేక సమ్మర్ సందడి సరిగా సాగలేదు. ఇక సమ్మర్ లో చివరగా వచ్చే సినిమా పెద్ది (Peddi).
మరో మాసం రోజులు దాటితే వేసవి టాటా చెప్పేస్తుంది. ఇప్పటి దాకా ఒక్క హిట్టూ లేక సమ్మర్ సందడి సరిగా సాగలేదు. ఇక సమ్మర్ లో చివరగా వచ్చే సినిమా పెద్ది (Peddi). ప్రస్తుతం ప్రేక్షకులందరి చూపు పెద్దిపైనే ఉంది. ఈ మూవీ కూడా పలు వాయిదాలు చూశాకే జూన్ 25న రిలీజ్ చేయాలని ఆశించారు. అయితే జూన్ 4న వస్తుందనుకున్న భారీ చిత్రం టాక్సిక్ తప్పుకుంది. ఆ తేదీని క్యాప్చర్ చేస్తూ పెద్ది ముందుకు జరిగింది. అలా వేసవిలో చివరగా వస్తోన్న పెద్ది పై ఆశలు చిగురించాయి.
పెద్ది చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్నివెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నార.. ఈ మూవీని మైత్రీ మూవీమేకర్స్ తో కలసి సుకుమార్ రైటింగ్స్ సంస్థ పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే బుచ్చిబాబు... అందువల్ల ఆయన ఆశీస్సులు పెద్ది చిత్రానికి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకంతోనే దీనిని రిలీజ్ చేసే బాధ్యతలో పాలు పంచుకుంటున్నారు సుకుమార్. ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం ఓ ఎస్సెట్ కాగా, ఇందులో జాన్వీ కపూర్ నాయికగా నటించడం మరో ఆకర్షణ. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రుతి హాసన్ ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఇలా పలు విశేషాలతో పెద్ది రూపొందింది.
పెద్ది చిత్రం భారీ వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ యేడాది ఇప్పటి దాకా తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా అత్యధిక వసూళ్ళు చూసిన సినిమాగా నిలచింది. ఆ రికార్డును పెద్ది సునాయాసంగా అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే పెద్దికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ యేడాది సమ్మర్ చివరలో వస్తోన్న పెద్ది ఏ తీరున జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి.