సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: అఖిల్ కోసం చరణ్ తగ్గుతాడా..

ABN, Publish Date - Apr 29 , 2026 | 01:36 PM

సాధారణంగా సమ్మర్ అంటేనే టాలీవుడ్‌లో పెద్ద సినిమాల జాతర. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం రివర్స్ అయింది.

Peddi Vs Lenin

సాధారణంగా సమ్మర్ అంటేనే టాలీవుడ్‌లో పెద్ద సినిమాల జాతర. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం రివర్స్ అయింది. వేసవి వేడి ఉన్నా కూడా థియేటర్ల దగ్గర మాత్రం పెద్ద సినిమాల సందడి లేక డ్రై సీజన్‌గా మిగిలిపోయింది. అయితే, ఈ డ్రై సీజన్‌లో కాకుండా స్కూల్స్‌, కాలేజెస్‌ మొదలయ్యే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మరొకరు కమ్ బ్యాక్ కోసం కసిగా ఉన్న అక్కినేని అఖిల్ Akkineni Akhil). జూన్ చివరి వారంలో ఈ ఇద్దరు హీరోలు నువ్వా-నేనా అంటూ తలపడబోతున్నారు.


ముందుగా పెద్ది సినిమా విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ కు ఆ రేంజ్ సక్సెస్ పడలేదు. వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలినా, ఈసారి పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీనికోసం చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మేకోవర్ వరకు పూర్తిగా తనను తాను మార్చుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన పహిల్వాన్ టీజర్ చూస్తే చరణ్ లోని ఆ మాస్ యాంగిల్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సన, ఈ మూవీని ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్, టీజర్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద చరణ్ వేట మొదలైనట్టే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 25న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది.


ఇక మరోవైపు, అక్కినేని వారసుడు అఖిల్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. 2023లో వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ కావడంతో, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత లెనిన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు అత్యంత కీలకం. అందుకే ఈసారి ఎక్కడా రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. లెనిన్ మూవీ చూశాక ఆయన ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. ఈ సినిమాలో కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన భరోసా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూన్ 26న లెనిన్ విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. పెద్ది జూన్ 25న వస్తుంటే, సరిగ్గా మరుసటి రోజే అంటే జూన్ 26న లెనిన్ థియేటర్లలోకి వస్తోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


లోకల్ సినిమా మార్కెట్ లో ఇలాంటి క్లాష్ రావడం వల్ల రెవెన్యూ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. థియేటర్ల పంపకం నుంచి కలెక్షన్ల వరకు ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయం. అటు చరణ్ మాస్ ఇమేజ్, ఇటు అఖిల్ మేకోవర్.. ఈ రెండింటిలో ప్రేక్షకులు దేనికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రామ్ చరణ్ సత్తా చాటాలనుకుంటుంటే, మరోవైపు అఖిల్ తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే లెనిన్ వాయిదాల మీద నడుస్తోంది. పెద్ది కోసమే మే 1 న లెనిన్ వాయిదా పడిందని టాక్. మరి ఇప్పుడు లెనిన్ కోసం పెద్ది వాయిదా పడుతుందా.. ? చరణ్.. అఖిల్ కోసం డేట్ త్యాగం చేస్తాడా.. ? అనేది చూడాలి.

Updated Date - Apr 29 , 2026 | 01:42 PM