సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Seetha Payanam: సీతా ప‌య‌నం నుంచి.. మ‌రో అద్భుత‌మైన పాట‌

ABN, Publish Date - Jan 29 , 2026 | 10:38 PM

యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న కూతురు ఐశ్వ‌ర్య ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం సీతా ప‌య‌నం.

Seetha Payanam

యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న కూతురు ఐశ్వ‌ర్య (Aishwarya Arjun)ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం సీతా ప‌య‌నం ('Seetha Payanam). ఈ సినిమాతో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజ‌న్ (Niranjan) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అర్జున్ (Arjun) స్వ‌యంగా సినిమాను నిర్మించ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ఫిబ్ర‌వ‌రి 6న థియేట‌ర్ల‌కు రానుంది.

కాగా ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజ‌ర్‌, పాట‌లు ఒక‌దాన్ని మించి మ‌రోటి విజ‌యం సాధించ‌డ‌మే గాక సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌య‌ప‌మే ప‌య‌న‌మే అంటూ సాగే సెన్సిబుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు కాస‌ర్ల‌ శ్యాం సాహిత్యం అందించ‌గా స్వీయ సంగీతంలో అనూప్ రూబెన్స్ (Anup Rubens) మ‌రో సింగ‌ర్ స‌త్య ప్ర‌కాశ్‌తో క‌లిసి ఆల‌పించారు. గ‌త పాట‌ల్లానే ఈ పాట కూడా విన‌గానే క‌రెక్ట్ అయ్యేలా అట్రాక్టివ్‌గా ఉంది. విజువ‌ల్స్ కూడా బావున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Jan 29 , 2026 | 11:34 PM