సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ భార్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్.. రేణుకి జరిగిందే జరిగిందా

ABN, Publish Date - Oct 26 , 2026 | 06:48 PM

ఈమధ్య సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారయ్యింది అంటే.. అసలు అందులో లేకపోవడమే చాలా బెటర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారు.

Anna Konidela

ఈమధ్య సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారయ్యింది అంటే.. అసలు అందులో లేకపోవడమే చాలా బెటర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారు. ట్రోలింగ్, నెగిటివిటీతో సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టలేకపోతున్నారు. మరికొందరు అయితే మాకొద్దురా బాబు ఈ సోషల్ మీడియా అంటూ పక్కకి తప్పుకుంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అనా కొణిదెల (Anna Konidela) కూడా ఇలాంటి నెగిటివిటీ తట్టుకోలేకే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను సడెన్‌గా డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.


తెలుగు చిత్రసీమలో తిరుగులేని క్రేజ్ ఉన్న పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతిమణి అనా కొణిదెల కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించిన దగ్గరనుంచి ఆమె తన కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలను వరుసగా షేర్ చేస్తూ మెగా అండ్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను సడెన్‌గా డియాక్టివేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఆక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన అనా, ఉన్నట్టుండి అకౌంట్ తొలగించడం వెనుక ఉన్న కారణాలపై నెట్టింట రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.


చాలామంది పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీపై నెగిటివ్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారని, అందులోకి అనా, ఆమె పిల్లలను కూడా లాగుతుండడంతో ఈ భాద భరించలేకనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ ట్రోలింగ్, నెగిటివిటీ పవన్ కి కొత్తేమీ కాదు. కానీ, అనా ఈ ట్రోలింగ్ ని తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఇక అనా కన్నా ముందు నుంచి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మీద కూడా ఇలాంటి ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ కి భయపడే ఆమె రెండో పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారని టాక్ కూడా ఉంది. అయినా రేణు ఈ ట్రోలింగ్ కి భయపడకుండా గట్టి కౌంటర్లు ఇస్తూ నిలబడ్డారు. కానీ, అనా మాత్రం సైలెంట్ గా అకౌంట్ ని డిలీట్ చేశారని తెలుస్తోంది. మరి ఇదే నిజమా.. ? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? అనేది తెలియాలంటే అనా స్పందించేవరకు ఆగాల్సిందే.

Updated Date - Oct 26 , 2026 | 06:48 PM