Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్.. డబ్బింగ్ షురూ
ABN, Publish Date - Jan 27 , 2026 | 03:27 PM
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డబ్బింగ్ పనులకు శుభ ముహూర్తం కుదిరింది
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ (Harish Shankar) శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డబ్బింగ్ పనులకు శుభ ముహూర్తం కుదిరింది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ వెల్లడించారు. గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను త్వరలోనే నిర్మాతలు వెల్లడించనున్నారు.