Pawan Kalyan: ఏపీలో 'అనగనగా ఒక రాజు' షూటింగ్ వెనుక అసలు కథ
ABN, Publish Date - Jan 20 , 2026 | 11:13 AM
తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన లోకేషన్లను షూటింగ్స్ కోసం ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పిలుపుతో మార్పు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సినీ పరిశ్రమకు విశేషమైన మద్దతు లభిస్తోంది. స్వయంగా ఒక స్టార్ హీరో డిప్యూటీ సీఎంగా ఉండటంతో పరిశ్రమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీలో షూటింగ్స్ పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishtty), తన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga oka raju) షూటింగ్‌ను మెజారిటీ భాగం ఏపీలోనే నిర్వహించారు. (Shooting in AP)
గోదావరి జిల్లాల్లో సహజత్వం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో జరిగింది. స్టూడియోలకు పరిమితం కాకుండా రియల్ లోకేషన్లలో షూటింగ్ చేయడం వల్ల సినిమాకు మంచి అథెంటిసిటీ వచ్చిందని నవీన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్‌లో చెప్పిన మాటలు తన మనసుకు హత్తుకున్నాయని, అందుకే గోదావరి ప్రాంతాన్ని ఎంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. చిత్రీకరణ ఎక్కడ చేసిన అధికారులు ఈజీగా పర్మిషన్లు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని చెప్పారు. అధికారులు మాత్రమే కాకుండా, స్థానిక ప్రజలు కూడా షూటింగ్ సజావుగా సాగేందుకు తోడ్పడ్డారట. ఇక రియల్ లోకేషన్లలో పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ చేయడం వల్ల సినిమా క్వాలిటీ పెరగడంతో పాటు బడ్జెట్ కూడా అదుపులో ఉందని తెలుస్తోంది.
ఇక టాలీవుడ్‌కు కొత్త దిశ కేవలం స్టూడియో సెట్లకు పరిమితం కాకుండా, కథకు తగ్గట్టుగా ఏపీలోని సహజ సిద్ధమైన లొకేషన్లను వాడుకోవడం వల్ల సినిమాకు నిండుతనం వస్తుంది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ విజయం ఏపీలో షూటింగ్స్ నిర్వహించాలనుకునే ఇతర చిత్ర బృందాలకు పెద్ద బూస్ట్‌గా నిలిచింది. మరి నవీన్ పోలిశెట్టి బాటలోనే మరికొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఏపీ వైపు అడుగులు వేస్తారా? లేదా? చూడాలి.