Pawan Kalyan: పవన్ కల్యాణ్.. ‘అర్జున’.. రేసులో ముగ్గురు బడా డైరెక్టర్లు!
ABN, Publish Date - Oct 29 , 2026 | 09:08 AM
‘వకీల్‌సాబ్’ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్‌తో మరో చిత్రం చేస్తానని నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘వకీల్‌సాబ్’ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan)మరో చిత్రం చేస్తానని నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనుకున్నట్లుగానే దిల్ రాజు పవన్‌తో ఈ సినిమా ప్లాన్ చేశారని, త్వరలోనే కార్యచరణ మొదలుకానుందని చిత్రవర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ2’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా దర్శకుడు విడుదల చేశారు. ఇప్పుడు దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో మరో చిత్రం అనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం ‘అర్జున’ (Arjuna) అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
అంతే కాదు.. ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ముగ్గురు దర్శకులు పోటీ పడుతున్నారని కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం వరిస్తుందో చూడాలి. ముగ్గురూ దిల్ రాజుకి కావలసినవారే! ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. కీర్తి సురేష్, రుక్మిణి వసంత్ కథానాయికలుగా కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.