సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓజీ 2 స్టోరీ లీక్.. సుజీత్ ప్లాన్ మామూలుగా లేదుగా

ABN, Publish Date - Jun 28 , 2026 | 07:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

OG 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక వీరాభిమాని అయిన దర్శకుడు తన అభిమాన హీరోని వెండితెరపై ఎలా చూడాలనుకుంటాడో.. అంతకుమించి పవర్ స్టార్‌ను సుజీత్ ఆవిష్కరించాడు. దీంతో ఓజీ-2 కోసం సినీ ప్రేక్షకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ యూనివర్స్‌ చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.


ఇటీవలే ఈ సినిమా స్టోరీ డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి స్వయంగా డైరెక్టర్ సుజీత్ హీరో పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా కథకు సంబంధించి ఒక సెన్సేషనల్ లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కేవలం ముంబై ముఠా రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాకుండా.. దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక భారీ చారిత్రాత్మక అంశాన్ని కూడా సుజీత్ జోడించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజం చెప్పాలంటే.. ఈ టాక్ ఓజీ రిలీజ్ కాకముందు నుంచి నడిచింది. మొదటి భాగంలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌లో భాగంగా 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి కథను, గంభీర వంశ మూలాలను చూపించబోతున్నారట. ఇక్కడే దర్శకుడు సుజీత్ ఒక ఊహించని చారిత్రక ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను ఈ స్టోరీకి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. 1940లలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) కోసం నేతాజీ దాచిన రహస్య నిధులు లేదా ఆ కాలం నాటి ఒక కీలకమైన మిస్టరీ చుట్టూనే హీరో ఓజీ ప్రయాణం సాగుతుందని సమాచారం. ఈ చారిత్రాత్మక లింక్ సినిమా పరిధిని పెంచడమే కాకుండా, పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.


‘ఓజీ 2’ చిత్రానికి మొదటి భాగం కంటే చాలా పెద్ద హిట్ అయ్యే సామర్థ్యం, బలమైన కంటెంట్ ఉన్నాయని విశ్లేషకులు. కానీ అది పూర్తి స్థాయిలో సాధ్యం కావాలంటే, దర్శకుడు సుజీత్ కేవలం విజువల్స్, హీరో ఎలివేషన్లపైనే కాకుండా రైటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. సుజీత్ గత చిత్రాలైన ‘సాహో’, ‘ఓజీ’లలో విజువల్ ఇమాజినేషన్, వరల్డ్ బిల్డింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో ఎమోషనల్ గ్రిప్ కాస్త తగ్గిందనే విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈసారి నేతాజీ, INA వంటి భారీ చారిత్రక అంశాలను కథలోకి తెస్తున్నప్పుడు వాటిని అంతే స్పష్టతతో, ఎమోషనల్ డెప్త్‌తో తెరపై ఎగ్జిక్యూట్ చేయడం చాలా ముఖ్యం. తన విజువల్ గ్రాండ్‌నెస్‌కు తగినట్లుగా ఆకట్టుకునే బిగువైన స్క్రీన్‌ప్లేను సుజీత్ రాసుకోగలిగితే.. ఈ సీక్వెల్ రికార్డులు తిరగరాయడం ఖాయం.

Updated Date - Jun 28 , 2026 | 07:18 PM