సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ద‌న్న‌య్య చ‌ర‌ణ్‌కు.. బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన చిట్టి తమ్ముడు

ABN, Publish Date - Mar 27 , 2026 | 09:28 AM

ఈ రోజు (శుక్ర‌వారం) మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో అభిమానులు వేడుక ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.

ram charan mark shankar

ఈ రోజు (శుక్ర‌వారం) మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో అభిమానులు వేడుక ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ప‌లువురు ఆస్ప‌త్రుల‌లో రొగుల‌కు పండ్లు అంద‌జేస్తుండ‌గా మ‌రి కొంద‌రు అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు చేస్తున్నారు. అంతేగాక చ‌ర‌ణ్ ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాల‌ని కొరుకుంటూ ఆలయాల్లో రామ్ చ‌ర‌ణ్ పేరిట ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా.. ఓ రోజు ముందుగానే హైద‌రాబాద్‌లో ఫ్యాన్స్ ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌మించి రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్ సైతం హ‌జ‌రై అభిమానుల్లో జోష్ నింపారు. మెగా ఫ్యామిలీ నుంచి సుస్మిత‌, నిహారిక (Niharika Konidela), చిరంజీవి సోద‌రి మాద‌వి ప్రత్యేక అతిథులుగా విచ్చేసి ప్ర‌సంగించారు.

అయితే.. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) స‌తీమ‌ణి అన్నా (Anna Lezhneva). రామ్ చ‌ర‌ణ్‌తో ఉన్న అనుండ‌ధాన్ని గుర్తు చేస్తూ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ (Mark Shankar Pawanovich) తో చ‌రణ్ ఉన్న ఫొటో షేర్ చేసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో, పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా మార్క్‌, చ‌ర‌ణ్ ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న దృశ్యాన్ని చూస్తు ఫ్యాన్స్ మైమ‌రిచిపోతున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 09:37 AM