సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఆయన కష్టపడితే నేను తింటున్నానని గిల్టీగా ఉండేది

ABN, Publish Date - Aug 22 , 2026 | 04:04 PM

మెగాస్టార్ చిరంజీవి నేడు 71 వ పుట్టినరోజును జరుపుకొంటున్న విషయం తెల్సిందే. ఇక చిరు బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అభిమనులతో పాటు.. సినీ,రాజకీయ ప్రముఖులు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి నేడు 71 వ పుట్టినరోజును జరుపుకొంటున్న విషయం తెల్సిందే. ఇక చిరు బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అభిమనులతో పాటు.. సినీ,రాజకీయ ప్రముఖులు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చిరు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. అన్నకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. చిన్నతనం నుంచి అన్నయ్యనే తనకు హీరో అని.. దేవుడు అని తెలిపారు. అంతేకాకుండా చిరు పెళ్లిలో తాను ఏడిచానని.. పెళ్లి తరువాత అన్నయ్య ఎక్కడ దూరం అయ్యిపోతాడేమో అన్న భయం తనలో భయాన్ని కలిగించినట్లు చెప్పారు.


చదువుకోసం నరసాపురం వెళ్లిన అన్నయ్య వేసవి సెలవులకు ఇంటికి వస్తే పండుగలా ఉండేదని, మళ్లీ వెళ్తుంటే ఎంతో బాధగా ఉండేదని పవన్ తెలిపారు. స్కూల్ రోజుల్లో ఆయన పక్కన నడవడం ఒక గర్వకారణంగా ఉండేదని, బుల్లెట్ బైక్ పై కర్లీ హెయిర్, ఎన్సీసీ క్యాడెట్ ఫిజిక్, బెల్ బాటమ్ ప్యాంట్లతో వెళ్తుంటే ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ బాయ్ గా మారిపోయేవాడినని అన్నారు. అలాగే చిరంజీవి మొదటి సింగపూర్ ట్రిప్ నుండి తెచ్చిన బ్లూ కలర్ బ్యాగ్‌లో తనకు దక్కిన మొదటి లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్స్, మ్యూజిక్ టేపుల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి గారి పెళ్లి సమయంలో ఆయన తమకు దూరమైపోతారేమో అని గదిలో ఒంటరిగా ఏడ్చానని, ఆ సమయంలో వదినను తీసుకొచ్చి రా.. నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తా అని ఇద్దరూ నవ్విన సన్నివేశాన్ని పవన్ పంచుకున్నారు.


ఆ తర్వాత మద్రాస్ (చెన్నై) లో అన్నయ్య వద్దే ఉంటూ ఆయన పడిన కష్టాన్ని దగ్గరుండి చూశానని పవన్ తెలిపారు. రోజుకు 18 గంటల పాటు చెమటలు చిందిస్తూ, తీవ్రమైన ఎండలో షూటింగ్స్ చేసి అర్థరాత్రి ఇంటికి అలసిపోయి వచ్చే చిరంజీవిని చూసి, ఆయన కష్టం మీద తాను తింటున్నందుకు అప్పట్లో ఎంతో గిల్టీగా భావించేవాడినని ఎమోషనల్ అయ్యారు. తన చదువు, భవిష్యత్తుపై అన్నయ్య ఎప్పుడూ ఒత్తిడి తేలేదని, కుటుంబంతో పాటు పరిశ్రమలోని అందరికీ ఆయన కొండంత అండగా నిలిచారని కొనియాడారు. దక్షిణ భారత, హిందీ చిత్రసీమల మధ్య ఒక సాంస్కృతిక వారధిగా నిలిచిన చిరంజీవి, ఇటీవల వెన్నుముక ఆపరేషన్ జరిగినప్పటికీ వెంటనే కోలుకుని మళ్లీ వర్క్ మొదలుపెట్టారని ప్రశంసించారు. మదర్ నేచర్ మీకు నిండైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని ఆకాంక్షిస్తూ, చిరంజీవి జీవితం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ తన శుభాకాంక్షలు ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Aug 22 , 2026 | 04:04 PM