సీఎం విజయ్ గెలుపుపై పవన్ అసూయ..
ABN, Publish Date - May 25 , 2026 | 08:57 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాక్చాతుర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుతూనే మాటల తూటాలు పేల్చేస్తూ ఉంటారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాక్చాతుర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుతూనే మాటల తూటాలు పేల్చేస్తూ ఉంటారు. ఒకప్పుడు స్టేజిపై మాట్లాడడానికే సిగ్గుపడిన వ్యక్తి.. ఇప్పుడు స్టేజి ఎక్కి ఎంతోమందికి మోటివేషన్ ఇస్తున్నారు. ఇక తాజాగా పవన్.. తమిళనాడు సీఎం విజయ్ గెలుపుపై జోకులు వేశారు. ఆ రాజకీయాలు చాలా సుఖంగా జరిగాయని మాట్లాడారు.
జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్... మొదట తమిళనాడు ఎన్నికలపై జోకులు వేసి కార్యకర్తలను నవ్వించారు. ' జనసేనకు ఎప్పుడు చెప్తుంటాను.. నాకు ఎంత కష్టంగా ఉంటుంది.. వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని. ఈ మధ్య తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నాను. వాళ్ళెంత సుఖంగా చేశారు పాలిటిక్స్. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. చక్కగా సీఎం అయిపోయారు. నన్ను 15 ఏళ్ళు రోడ్డు మీద తిప్పించినా కూడా ఏం అవ్వలేదు.
సరదాగా అన్నాను. నేను మానవత్వం గురించి ఆలోచించాను. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఆ పార్టీలో ఎందుకు ఇన్ని సంవత్సరాలు నలిగాను. ఒక పార్టీని ఇన్నేళ్లు ఏకతాటిపై నడిపించడం అంటే మామూలు విషయం కాదు. మన ఇంట్లోనే అందరూ ఏకతాటిపై ఉండం. అలాంటిది నేనెంత సాహసం చేశాను అంటే.. బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామనే పిచ్చి. అది నాకు చాలా ధైర్యాన్నిచ్చింది' అని చెప్పుకొచ్చారు.