Pawan Kalyan CW: శంకర్ వరప్రసాద్‌గారి టీమ్‌కు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అభినందనలు..
ABN, Publish Date - Jan 22 , 2026 | 12:12 PM
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ (Pawan Kalyan Creative works) అభినందనలు తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ (Pawan Kalyan Creative works) అభినందనలు తెలిపింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu) . సంక్రాంతి బరిలో విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మేరకు పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
‘నాలుగు దశాబ్దాలకుపైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు ఎంతో దగ్గరగా ఉంటూ, తన నటన, కామెడీ, డాన్స్, అదే ఉత్సాహంతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా మరో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి అందుకున్న మరో బ్లాక్‌బస్టర్ ఇది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ను వెండితెరపై చూపించి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహం కలిగించిన దర్శకుడికి హృదయపూర్వక అభినందనలు. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన శక్తివంతమైన సంగీతం చిత్రానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇందుల చిరంజీవి మేనకోడలు నైరా ఫ్లయింగ్ హై పాటను పాడటం విశేషం ఈ విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయ్యేలా రూపొందించిన నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలకు, అలాగే హీరోయిన్‌గా ఈ చిత్రంలో బాగమైన నయనతారకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు.