Pawan Kalyan: మీ నేతృత్వంలో ప్రతిభావంతులైన టెక్నీషియన్లు రావాలి..
ABN, Publish Date - Jun 22 , 2026 | 11:25 AM
ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంసకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంసకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan - Manoj Paramahamsa) అభినందనలు తెలిపారు. చెన్నైలోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎం.జి.ఆర్. ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ ఛైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం పరమహంసను నియమించడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ విడుదల చేశారు.
‘మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా తెలుగు, తమిళ చిత్రాలకు పని చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సినిమా రూపకల్పన, నిర్మాణ శైలిపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణుడు. చెన్నైలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ నుంచే అన్నయ్య చిరంజీవి, రజనీకాంత్ గారు, శ్రీమతి సుహాసిని, నాజర్, రాజేంద్ర ప్రసాద్ లాంటి అగ్రశ్రేణి నటులు, పి.సి.శ్రీరామ్, శ్రీ పి.ఎస్.నివాస్ లాంటి సాంకేతిక నిపుణులు వచ్చారు. మనోజ్ పరమహంస నేతృత్వంలోనూ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.