పవన్- సురేందర్ రెడ్డి సినిమా లేనట్టేనా

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:34 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఒకపక్క రాజకీయ బాధ్యతలు భుజాన వేసుకుంటూనే... మరోపక్క తన పెండింగ్ సినిమాలను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్.

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఒకపక్క రాజకీయ బాధ్యతలు భుజాన వేసుకుంటూనే... మరోపక్క తన పెండింగ్ సినిమాలను జెట్ స్పీడ్‌లో పూర్తి చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్. ఇక గతేడాది రిలీజ్ అయిన ఓజీ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూశాం. అంచనాలను మించిపోయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ ఊపు ఇంకా తగ్గకముందే... సోషల్ మీడియాలో ఓజీ-2 హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే... ఈ సినిమాకు సీక్వెల్ కూడా పక్కా అని అర్థం అవుతోంది. సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెల్ అనగానే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. కథ పూర్తిగా రెడీ అయితే చాలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవన్ ఈ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఛాన్స్ గట్టిగానే ఉంది.


కానీ, ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ దాగుంది. ఓజీ-2 కంటే ముందే టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ పై చర్చలు జరిగాయి. సురేందర్ రెడ్డి ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ పవన్‌కు వినిపించారు. ఆ బేసిక్ ఐడియా నచ్చినప్పటికీ... స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేయాలని పవన్ సూచించినట్లు సమాచారం. పవర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయనకున్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి వేగంగా కసరత్తులు చేస్తున్నారు. అఖిల్ తో తీసిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ డిజాస్టర్ ఇంపాక్ట్ సురేందర్ రెడ్డి కెరీర్‌పై గట్టిగానే పడింది. ఆ రిజల్ట్ తర్వాత... తన నెక్స్ట్ మూవీ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్‌తో చేసే సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో, స్క్రిప్ట్‌పై చాలా డీప్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ పర్ఫెక్షన్ వల్లే... ఆ కథ పూర్తిగా ఫైనల్ అవ్వడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతోంది.


సరిగ్గా ఈ లాంగ్ గ్యాప్ వల్లనే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. అసలు పవన్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టేశారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ ఈ రూమర్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో... అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే... అటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి లేదా ఇటు పవన్ కళ్యాణ్ టీమ్ అఫీషియల్‌గా నోరు విప్పాల్సిందే. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఒక సాలిడ్ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ అయినా ఈ కాంబో ఉందని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది

Lenin: మళ్ళీ అయ్యగారి సినిమా వాయిదా.. ?

షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో

Updated Date - Jun 13 , 2026 | 01:00 PM