సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జిమ్ జిమ్ తార’ ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసిన ‘పర్ణశాల’ టీమ్

ABN, Publish Date - Oct 06 , 2026 | 10:11 PM

సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయాలంటే భారీగా డబ్బు ఖర్చు చేయాలి.. స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయాలి.. ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించాలి.. ఇలా ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రమోషన్ స్ట్రాటజీలు చూశాం.

Parnashala

సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయాలంటే భారీగా డబ్బు ఖర్చు చేయాలి.. స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయాలి.. ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించాలి.. ఇలా ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రమోషన్ స్ట్రాటజీలు చూశాం. కానీ ‘పర్ణశాల’ టీమ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించింది. పెద్ద బడ్జెట్ కంటే పెద్ద ఐడియా ఉంటే చాలు అనేలా ఓ సింపుల్ కాన్సెప్ట్‌తో సినిమా ప్రమోషన్‌ను కొత్త ట్రాక్‌లోకి తీసుకెళ్లింది.

SLT ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘పర్ణశాల’లోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు ఈ ప్రమోషన్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. పాటను కేవలం సినిమాలోని ఓ సాంగ్‌గా వదిలేయకుండా.. దాన్నే సినిమా ప్రచారానికి క్యాచీ హుక్‌గా మార్చుకోవడం టీమ్‌కు బాగా కలిసొచ్చింది.

సాధారణంగా సినిమా పాటలు ముందుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. ఆ తర్వాత రీల్స్, షార్ట్స్ ద్వారా మరింత రీచ్ వస్తుంది. కానీ ‘జిమ్ జిమ్ తార’ విషయంలో సీన్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోంది. పాటలోని క్యాచీ నేచర్ కారణంగా ఇది సోషల్ మీడియాను దాటి సాధారణ ప్రేక్షకుల మధ్య కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే లక్ష్మీదేవితో ఈ పాటను పాడించిన చిత్ర బృందం.. దాని క్రేజ్‌ను సినిమా ప్రమోషన్‌కు ఉపయోగించుకునేలా ప్లాన్ చేసింది. పెద్ద ఎత్తున పెయిడ్ క్యాంపెయిన్స్‌పై ఆధారపడకుండా.. జనాల్లో సహజంగా ఆసక్తి పెరిగేలా ప్రమోషన్‌ను డిజైన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఓ పాట వైరల్ కావడం అంటే కేవలం మ్యూజిక్‌కు వచ్చిన రెస్పాన్స్ మాత్రమే కాదు. అదే పాట సినిమా పేరును ప్రేక్షకులకు గుర్తుండేలా చేస్తే.. అక్కడే అసలు ప్రమోషన్ వర్క్ అవుతుంది. ‘పర్ణశాల’ టీమ్ ప్రస్తుతం ఇదే ఫార్ములాను ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తోంది.

ముఖ్యంగా పెద్ద స్టార్లు లేని సినిమాలకు ప్రమోషన్ బజ్ క్రియేట్ చేయడం పెద్ద సవాల్. అలాంటి పరిస్థితుల్లో భారీ ఖర్చు లేకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఐడియా దొరికితే అది సినిమాకు బలమైన అడ్వాంటేజ్‌గా మారుతుంది. ‘జిమ్ జిమ్ తార’ విషయంలో అదే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

‘జిమ్ జిమ్ తార’కు వస్తున్న స్పందన సినిమాపై క్యూరియాసిటీగా మారుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాట ద్వారా వచ్చిన గుర్తింపు థియేట్రికల్ రిలీజ్ వరకు కొనసాగితే ‘పర్ణశాల’కు అది మంచి ఓపెనింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

అంతేకాదు.. చిన్న సినిమాలకు ప్రమోషన్ విషయంలో భారీ బడ్జెట్ కంటే క్రియేటివ్ ఐడియా ఎంత ముఖ్యమో ఈ ప్రయత్నం మరోసారి చూపిస్తోంది. సినిమా కంటెంట్‌కు సరిపోయే ఓ ప్రత్యేకమైన ప్రమోషన్ హుక్ దొరికితే.. అదే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా మారొచ్చు.

ప్రస్తుతం ‘పర్ణశాల’ ప్రమోషన్‌లో ‘జిమ్ జిమ్ తార’ కీలకంగా మారింది. పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ ఆసక్తిని సినిమా వైపు మళ్లించడమే టీమ్ ముందున్న అసలు టార్గెట్.

వై.జి. భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే తన డిఫరెంట్ ప్రమోషన్ స్ట్రాటజీతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ.. థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 06 , 2026 | 10:21 PM