సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘డైమండ్‌ డెకాయిట్‌’.. ట్రైల‌ర్

ABN, Publish Date - Apr 05 , 2026 | 07:53 AM

పార్ధ గోపాల్ హీరోగా నటిస్తూ సూర్య జి.యాదవ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’.

Diamond Dacoit

పార్ధ గోపాల్ ( Pardha Gopal) హీరోగా నటిస్తూ సూర్య జి.యాదవ్ (Surya G Yadav) దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’(Diamond Dacoit) . మేఘన కథానాయిక. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత శిరీష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కథలోని థ్రిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి’ అని అన్నారు. పార్ధ గోపాల్‌ మాట్లాడుతూ ‘ఇది సాధారణ కథ కాదు. సస్పెన్స్‌, ఎమోషన్స్‌, థ్రిల్‌ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు సూర్య జి.యాదవ్‌, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వాకాడ అప్పారావు, శివాజీ రాజా, పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 07:53 AM