సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్యారడైజ్ వాయిదా.. స్పందించిన టీమ్

ABN, Publish Date - May 13 , 2026 | 04:12 PM

టాలీవుడ్‌ హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani), ఇప్పుడు తన మాస్ విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సెకండ్ వెంచర్ ది ప్యారడైజ్ (The Paradise)

The Paradise

టాలీవుడ్‌ హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani), ఇప్పుడు తన మాస్ విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సెకండ్ వెంచర్ ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. సినిమా అనుకున్న విధంగా రాలేదని, రీ షూట్స్‌ జరుగుతున్నాయని, మళ్లీ పోస్ట్‌ పోన్‌ అనే వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌ అన్నింటికి చిత్ర యూనిట్‌ చెక్‌ పెట్టింది.


ముందుగా నాని గురించి చెప్పుకోవాలంటే, యంగ్ హీరోల్లో ఆయన రూటే వేరు. నాచురల్ పర్ఫార్మెన్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా, ఇప్పుడు పక్కా మాస్ ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకున్నారు. నాని కెరీర్‌లో ఒక ప్రత్యేకత ఉంది.. ఒక్కసారి రిలీజ్ డేట్ లాక్ చేస్తే, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. కానీ దిప్యారడైజ్ విషయంలో మాత్రం సీన్ కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్ చూస్తుంటే, నానిని మరో కొత్త యాంగిల్‌లో చూపించబోతున్నారని స్పష్టమైంది. నిజానికి ఈ చిత్రం మార్చి 26నే థియేటర్లలోకి రావాలి. అయినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం తో పాటు మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమాను ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది! షూటింగ్‌లో ఆలస్యం జరుగుతోందని, కొన్ని సీన్లు రీ-షూట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. దీంతో ఆగస్టు 21న కూడా సినిమా రావడం కష్టమే అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.


ఈ వార్తలతో నాని ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ తాజాగా ప్యారడైజ్ టీమ్ ఈ రూమర్లన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చింది. రీసెంట్‌గా సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆగస్టు 21 రిలీజ్ డేట్‌ను స్పష్టంగా మెన్షన్ చేశారు. దీనితో పాటు, సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో నాని ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సినిమా కేవలం నాని కోసమే కాదు, ఇందులో ఉన్న ఇతర నటీనటుల కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


ది ప్యారడైజ్‌ చిత్రంలో నానికి జోడీ గ్లామర్‌ క్వీన్‌ కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆయన ఒక పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో మోహన్‌ బాబు నటిస్తున్నారు. నాని - మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని టాక్. బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఆయాషేర్' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా లేట్ అయినా సరే, అవుట్‌పుట్ మాత్రం అదిరిపోయేలా ఉండాలని శ్రీకాంత్ ఓదెల కష్టపడుతున్నారు. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మరియు భారీ యాక్షన్ చిత్రంగా నిలవబోతోంది. ఆగస్టు 21న బాక్సాఫీస్ వద్ద నాని ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తారో చూడాలి!

Updated Date - May 13 , 2026 | 04:15 PM