సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

New York: అంతర్జాల వేదికగా.. SP బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి

ABN, Publish Date - Oct 01 , 2026 | 11:46 AM

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా బాలు ఆరవ వర్ధంతిని ఘ‌నంగా నిర్వహించారు.

S. P. Balasubrahmanyam

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత గాయకుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) అభిమానులు స్థాపించిన ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ (SPB MUSIC ACADEMY) ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా బాలు ఆరవ వర్ధంతిని మంగళవారం రాత్రి నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ, బాలు తెలుగు భాషతోపాటు తమిళ, హిందీ కన్నడ, మలయాళం తదితర భాషల్లో పాటలు పాడి ఆయా ప్రాంతాల వారి అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఆయనకు మృత్యువు తొందరగా వచ్చిందని, ఇంకొంత కాలం బాలు బతికి ఉంటే తెలుగు భాషకు ఆయన పాట, మాట ద్వారా ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు.

వంశీ సంస్థ అధినేత వంశీ రామ రాజు మాట్లాడుతూ.. ఘంటసాల (Ghantasala) తర్వాత బాలు ఆయన స్థానాన్ని భర్తీ చేశారని, బాలు తర్వాత అంతటి గాయకుడు ఇంకా రాలేదన్నారు. ప్రముఖ గాయకులు రామాచారి, నేమాని పార్ధసారది, సందీ ఎవినోద్, ధీరజ్ బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన పాటలను మధురంగా ఆలపించారు.

గీత రచయిత రసరాజు పాల్గొన్న కార్యక్రమానికి అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్ గూడూరు సంస్థ కార్యక్రమాలను తెలిపారు. చైర్మన్ హరి ఇప్పనపల్లి స్వాగతం పలుకగా, బుర్ర రాజేశ్వరి, సుజాత, లావణ్య, శ్రీనివాన్రెడ్డి తాము గేదెల, చంద్రరవి, అయ్యగారి కుమారి, రాణి తది తరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన తెలుగు ప్రతినిధులు తమ సందేశాలు తెలిపారు.

Updated Date - Oct 01 , 2026 | 11:46 AM